
హైదరాబాద్: ‘మహర్షి’ సినిమా చిత్రీకరణ సమయంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఎంతగా కష్టపడ్డారో కళ్లారా చూశానని ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 'ప్రేక్షకులకు ఓ అద్భుతమైన చిత్రాన్ని కానుకగా ఇవ్వడానికి నువ్వు పడిన కష్టాన్ని నేను చూశా, ఇప్పుడు ప్రపంచం ఆ కష్టాన్ని చూడబోతోంది. గుడ్ లక్ టు మై లవ్ మహేశ్. ‘రిషి’ పాత్ర నాకెంతగా నచ్చిందో ప్రేక్షకులకి కూడా అంతేలా నచ్చుతుందని ఆశిస్తున్నా’అని పేర్కొన్నారు.
నమత్ర మహేశ్‌ను ఆలింగనం చేసుకున్న ఫోటోను పోస్ట్ చేశారు. మహేశ్ నమ్రత వెనక దాక్కుని ఆలింగనం చేసుకున్నట్లుగా ఉన్న ఈ ఫోటో సామాజికమాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మహర్షి’ తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్‌తో దూసుకుపోతోంది.