
‘చిత్రలహరి’... కేబుల్ టీవీ రాకముందు దూరదర్శన్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని ప్రోగ్రామ్. ప్రతి శుక్రవారం పసందైన పాటలతో టీవీలకు కళ్లప్పగించేలా చేసిన ఈ ప్రోగ్రామ్ పేరు మళ్లీ సీన్లోకొచ్చింది. అయితే చిన్నితెరపై కాదు.. ఈసారి పెద్ద తెరకొచ్చింది. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ వంటి హార్ట్ టచింగ్ మూవీస్ తెరకెక్కించిన కిశోర్ తిరుమల దర్శకత్వంలో నాని హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు ‘చిత్రలహరి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు ఫిల్మ్‌నగర్ సమాచారం.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో ఈ సినిమా సెట్స్‌కు వెళ్లనుందట. ప్రస్తుతం నాని ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది. అలాగే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో చేయనున్న మల్టీస్టారర్ సినిమా షూటింగ్‌ను ఫిబ్రవరి మొదటి వారంలో మొదలు పెట్టనున్నారు నాని. ఇలా సినిమా తర్వాత సినిమాలు ఒప్పేసుకుంటూ మోస్ట్ బిజీగా ఉన్నారీ సక్సెస్‌ఫుల్ హీరో.
Comments
Please login to add a commentAdd a comment