Kishore Thirumala
-
అలా రాయగలగడం నా అదృష్టం, వెంకటేశ్‌తో సినిమా నిజమే..
‘‘ఒక్కో సినిమాకు ఒక్కో ప్రయత్నం చేస్తుండాలి. నేను అదే చేస్తాను. ‘నేను.. శైలజ’ చిత్రంలో తండ్రీ కూతుళ్ల కథను చెప్పా. ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రంలో స్నేహం గురించి చెప్పాను. ‘చిత్రలహరి’ ఓ లూజర్ కథ. స్క్రిప్ట్‌లో నిజాయతీ ఉన్నప్పుడు సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతాను. ఆ నమ్మకంతోనే ఇప్పుడు ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రంలో మహిళల ప్రాముఖ్యతను చెప్పే ప్రయత్నం చేశాను’’ అన్నారు కిశోర్ తిరుమల. శర్వానంద్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించగా, రాధిక, ఖుష్బూ, ఊర్వశి కీలక పాత్రల్లో నటించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో కిశోర్ తిరుమల మాట్లాడుతూ.. ‘‘ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో వెంకటేశ్‌గారితో ఓ సినిమా అనుకున్న మాట వాస్తవమే కానీ ఆ కథ ఇది కాదు. నేపథ్యం ఒకటే అయినా కథ మారింది. మన కుటుంబాల్లోని మహిళలు మనకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ మన జీవితాలను తీర్చిదిద్దాలనుకుంటుంటారు. కొందరు మహిళలు చిన్న చిన్న ఆనందాలకే సంతోషపడిపోతుంటారు. వారు తమ పురుషులపై భారీ డిమాండ్స్ చేయరు. అలాంటి మహిళలకు గుర్తుగా ఓ సినిమా తీయాలనిపించి ఈ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ తీశాను. శర్వాకు ఈ కథ వినిపించినప్పుడు హ్యాపీ ఫీలయ్యాడు. ఐదుగురు అక్కాచెల్లెళ్ళు ఉన్న ఓ యువకుడి కథే ఈ చిత్రం. ఆ ఐదుగురి అక్కాచెళ్లళ్ళ భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ సినిమా కథ విని రష్మిక బాగా ఎంజాయ్ చేశారు. ఓ అమ్మాయిలా మీరు ఎలా ఆలోచించగలుగుతున్నారు? అని అడిగారు. అలాగే ‘ఉన్నది ఒకటే జీవితం’ సమయంలో కూడా ‘ఒక అమ్మాయి మాత్రమే ఇలాంటి డైలాగ్స్ చెప్పగలదు. మీరు అలానే రాస్తున్నారు’ అని అనుపమ అన్నారు. ఇలా స్క్రిప్ట్ రాయగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ‘ఆడవాళ్లు..’లో ప్రతి పాట కథను ముందుకు నడుపుతుంది. దేవిశ్రీ ప్రసాద్ మంచి పాటలిచ్చారు. మా సినిమా రిలీజ్ అనేది నిర్మాతల చేతుల్లో ఉంటుంది. (‘భీమ్లానాయక్’ ఈ నెల 25న వస్తోంది కాబట్టి ‘ఆడవాళ్లు..’ విడుదల వాయిదా పడుతుందా? అనే ప్రశ్నకు సమాధానంగా) నా తర్వాతి చిత్రం నాగచైతన్య హీరోగా ఉంటుంది’’ అన్నారు. -
ప్రతి పాత్ర కథకు కనెక్ట్ అయ్యుంటుంది
రామ్ మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘రెడ్’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా కిశోర్ తిరుమల చెప్పిన విశేషాలు. ► ‘ఇస్మార్ట్ శంకర్’లో మాస్‌గా కనిపించారు రామ్. ఆ తర్వాత వచ్చే ఈ సినిమాలోనూ అలాంటి ఒక క్యారెక్టర్ ఉంటే బాగుంటుందనుకున్నాం. అలా ఒక పాత్ర, నా స్టైల్ ఆఫ్ హీరోలా మరో క్యారెక్టర్ ఉంటుంది. రామ్‌తో నేను తెరకెక్కించిన మొదటి సినిమా (నేను శైలజ) లవ్, తర్వాత ఫ్రెండ్షిప్ (ఉన్నది ఒకటే జిందగీ). ఇప్పుడు తనతో చేసిన మూడో సినిమా ‘రెడ్’లో చాలా షేడ్స్ ఉన్నాయి. ► మాములుగా హీరోకి రెండు క్యారెక్టర్లు ఉంటే ఒకటి సాఫ్ట్, రెండోది రఫ్ అన్నట్లు ఉంటుంది. కానీ ఈ సినిమాలో అలా ఉండదు. రామ్‌లో కొత్త యాంగిల్ కనబడుతుంది. అలాగే దర్శకుడిగా నాలోనూ కొత్త యాంగిల్ చూస్తారు. హీరో బాగా డ్యాన్స్ చేస్తాడు కాబట్టి ఓ మాస్ పాట పెట్టాం. రామ్, నేను రెండు సినిమాలు చేశాం కాబట్టి మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. ► ఈ సినిమాలోని ప్రతీ క్యారెక్టర్ కథకు కనెక్ట్ అయ్యుంటుంది. ముగ్గురు హీరోయిన్లదీ మంచి క్యారెక్టరైజేషన్. నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్, మాళవికా శర్మ పాత్రలు ఆకట్టుకుంటాయి. అయితే నివేదా పాత్ర ఇంకొంచెం బలంగా ఉంటుంది. ► జనరల్‌గా థ్రిల్లర్ సినిమా అంటే ఒక మీటర్లో ఉంటుంది. అయితే థ్రిల్లర్ ప్రధానంగా సాగే ‘రెడ్’ సినిమా అలా అనిపించదు. ఈ చిత్రంలో డ్రామా, యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉండటంతో పక్కా కమర్షియల్ చిత్రంలా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే విధంగా ఉంటుంది. ► అప్పట్లో చెన్నైలో ఉండటంవల్ల ఓ తమిళ సినిమా చేశాను. ఆ తర్వాత తెలుగు మీద దృష్టి పెట్టాను. లాక్డౌన్లో శర్వానంద్ కోసం ఓ కథ, మరో రెండు స్క్రిప్ట్‌లు తయారు చేసుకున్నాను. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేశాను. -
ఇలాంటి కేస్ ఇదే ఫస్ట్ టైమ్..
రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రం ‘రెడ్’. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణ పోతినేని సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. తాజాగా ‘రెడ్’ టీజర్‌ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. ‘క్రైమ్ హిస్టరీలో ఇలాంటి కేసు చూడటం ఇదే ఫస్ట్ టైమ్’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన చిత్ర టీజర్.. చివరివరకు ఇంట్రెస్టింగ్ సాగింది. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్.. క్లాస్, మాస్ లుక్స్‌లో అదరగొట్టినట్టుగా టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్‌తో సత్తా చాటిన రామ్.. ఈ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడని అభిమానులు అంటున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ తర్వాత రామ్, కిశోర్ తిరుమల కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ‘రెడ్’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. -
బర్త్‌డే స్పెషల్
రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రెడ్’. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య పోతినేని సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఇందులో నివేదా పేతురాజ్ కథానాయికగా నటించనున్నారు. శనివారం నివేదా పుట్టినరోజు సందర్భంగా ఆమెను కథానాయికగా ఖరారు చేసిన విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. ఆమె పుట్టినరోజు వేడుకలు కూడా ‘రెడ్’ చిత్రబృందం సమక్షంలో గోవాలో జరిగాయి. ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. -
థ్రిల్లింగ్ రెడ్
రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘రెడ్’. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణ పోతినేని సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. రామ్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘రామ్‌కు ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి సూపర్‌హిట్ అందించిన పూరి జగన్నాథ్‌గారికి థ్యాంక్స్. మా బ్యానర్లో రామ్ ఇప్పటివరకు చాలామంచి సినిమాలు చేశారు. ‘రెడ్’ కూడా మరో మంచి చిత్రంగా నిలిచిపోతుందని భావిస్తున్నాను. నవంబర్ 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారం భిస్తాం. వచ్చే ఏడాది ఏప్రిల్ 9న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. ఓ సినిమా సోల్‌ను తీసుకుని, అందులో మార్చులు చేసి ‘రెడ్’ సినిమాను తెరకెక్కిస్తాం’’ అన్నారు. ‘‘కెరీర్లో తొలిసారి థ్రిల్లర్ జానర్లో సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని రామ్ అన్నారు. ‘‘రామ్‌తో మూడోసారి సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. థ్రిల్లర్‌కు వాణిజ్య పరమైన అంశాలు జోడించి కథ, కథనాలు ప్రేక్షకులకు కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మణిశర్మగారు మా సినిమాకు సంగీతం అందిస్తున్నందుకు చాలా సంతోషం’’ అన్నారు కిశోర్ తిరుముల. నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, అనిల్ సుంకర, రామ్ ఆచంట, కృష్ణ పోతినేని పాల్గొన్నారు. -
హీరో రామ్ ‘రెడ్’ చిత్రం ప్రారంభం
-
ఇస్మార్ట్ శంకర్ ‘రెడ్’ ప్రారంభం
‘ఇస్మార్ట్ శంకర్’తో ఎనర్జటిక్ హీరో రామ్ పోతినేని బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. అయితే ఆ సినిమా విడుదలై వందరోజులు పూర్తయినప్పటికీ మరో సినిమాను ఆనౌన్స్ చేయలేదు. అయితే దీపావళి కానుకగా తన కొత్త సినిమాను ప్రకటించాడు రామ్. తనకు ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ వంటి హిట్ చిత్రాలను అందించినటువంటి కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రెండ్రోజుల క్రితం ఈ సినిమాకు ‘రెడ్’అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశాడు. తాజాగా ఆ చిత్ర షూటింగ్ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్, బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ చార్మి, తదితరులు హాజరయ్యారు. పూజాకార్యక్రమాలు నిర్వహించిన అనంతరం హీరో రామ్‌పై పూరి తొలి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించాడు. కాగా, ఇది రామ్‌కు 18వ చిత్రం. కృష్ణ పోతినేని సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్ పెదనాన్న ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. ఇక రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. రామ్ సరసన నటించే హీరోయిన్ను ఇంకా ఫైనల్ చేయలేదని చిత్ర యూనిట్ పేర్కొంది. అంతేకాకుండా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. ఇక ఇప్పటివకే విడుదలైన ఫస్ట్ లుక్‌లో రామ్ రఫ్‌గా కనిపించాడు. అంతేకాకుండా రామ్ లుక్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా, ‘రెడ్’ సినిమా తమిళంలో సూపర్ హిట్ అందుకున్న ‘తడమ్’కు రిమేక్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ మొదటిసారి ద్విపాత్రాభియం చేస్తున్నట్టు సమాచారం. మరి ‘రెడ్’ చిత్రంతో రామ్ మరో సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి. ఇదిలా ఉంటే, కిశోర్ తిరుమల ఈ ఏడాది ‘చిత్రలహరి’ సినిమాతో హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్‌ను మళ్లీ ట్రాక్‌పైకి తీసుకొచ్చారు. ఇప్పుడు రామ్‌తో ముచ్చటగా మూడోసారి పనిచేస్తున్నారు. మరి హ్యాట్రిక్ సాధిస్తారో లేదో చూడాలి. రీఎంట్రీ ఇవ్వనున్న శృతిహాసన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘కాటమ రాయుడు’ తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు శృతి హాసన్. ఆ సినిమా వచ్చి రెండేళ్లు కావస్తున్నా మరే తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. తాజాగా రవితేజ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనుంది ఈ కోలీవుడ్ బ్యూటీ. డాన్ శీను, బలుపు వంటి బ్లాక్ బస్టర్ హిట్లనందించిన గోపిచంద్ మలినేని దర్వకత్వంలో రవితేజ ఓ సినిమా తీయబోతున్నారు. ఇది రవితేజకు 66వ చిత్రం కావడం విశేషం. అయితే ఈ సినిమాకు సంబంధించిన రీసెంట్ అప్డేట్ ప్రకారం ఈ చిత్రంలో రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా శృతిహాసన్ సైతం ట్విటర్ వేదికగా స్పందిస్తూ ఈ సినిమా షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం రవితేజ ‘డిస్కోరాజా’షూటింగ్ శరవేగంగా జరపుకుంటోంది. వీఐ ఆనంద్ దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Welcoming ..the multi talented actress @shrutihaasan on board 😊👍👍 #RT66 pic.twitter.com/Coym47HUDF — Gopichand Malineni (@megopichand) October 30, 2019 -
నవంబర్‌లో ఇస్టార్ట్
‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్‌తో ఇస్మార్ట్ ఎనర్జీతో ఉన్నారు రామ్. అదే ఎనర్జీతో నెక్ట్స్ సినిమా షురూ చేయడానికి రెడీ అయ్యారు. నవంబర్ నుంచి కొత్త సినిమా సెట్లో అడుగుపెడతారట రామ్. ‘నేను.. శైలజ, ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాలను రామ్‌తో తెరకెక్కించిన కిశోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకుడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందనున్న ఈ మూడో సినిమాకు ఓ వెరైటీ కథ అనుకున్నారని సమాచారం. నవంబర్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తమిళ చిత్రం ‘తడమ్’కి ఇది రీమేక్ అట. ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించనున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించనున్నారని సమాచారం. -
నచ్చలేదని చెప్పే చొరవ వచ్చింది
‘‘ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వల్ల నాకు చాన్సులు వస్తున్నాయని నేను నమ్మడం లేదు. కుటుంబ నేపథ్యం వల్ల ఒకటో రెండో వస్తాయి. ఆ తర్వాత పట్టించుకోరు. వరుసగా నా ఆరు సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ నటుడిగా నన్ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారనే నమ్ముతున్నాను. ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంపై నాకు జడ్జిమెంట్ రాలేదు. అది వస్తే అన్నీ నేర్చుకున్నట్లే. యాక్టర్‌గా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇష్టపడతాను’’ అని సాయిధరమ్ తేజ్ అన్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘చిత్రలహరి’. ఇందులో కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటించారు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో సాయిధరమ్ తేజ్ చెప్పిన విశేషాలు. ► నా స్క్రీన్ నేమ్‌ని సాయితేజ్‌గా మార్చుకోవడం వెనక పెద ్దకారణాలేవీ లేవు. ధరమ్‌ని కొంతకాలం పక్కన పెట్టానంతే. ఈ చిత్రంలో జీవితంలో సక్సెస్ తెలియని విజయ్కృష్ణగా నటించాను. ఒకరి జీవితాన్ని ఓ ఐదు పాత్రలు ఎలా ప్రభావితం చేశాయి? అన్నదే కథ. విజయ్ క్యారెక్టర్‌కు బాగా కనెక్ట్ అయ్యాను. కథ విన్నప్పుడే మంచి సినిమా అవుతుంది, వదులుకోకూడదనుకున్నాను. ► పదకొండేళ్లుగా కిషోర్ తిరుమల తెలిసినప్పటికీ సినిమా చేయడం కుదర్లేదు. ఇప్పటికి కుదిరింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంశాలను కిషోర్ బాగా చూపిస్తారు. నా ఆరు సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ నన్ను నమ్మి చాన్స్ ఇచ్చారు మైత్రీ మూవీస్ నిర్మాతలు. ఇండస్ట్రీలో ఇలాంటి నిర్మాతలు ఉండాలి. దేవి అన్న మ్యూజిక్ చాలా ఇష్టం. ‘దేవి మ్యూజిక్‌లో నువ్వు డ్యాన్స్ చేస్తే చూడాలని ఉంది’ అని మా అమ్మ అనేవారు. ఈ సినిమాతో అది నెరవేరడం హ్యాపీ. అలాగే సునీల్ అన్నతో వర్క్ చేయడం అనేది నాకున్న కలలో ఒకటి. అది కూడా నెరవేరినందుకు హ్యాపీ. ► నా గత ఆరు సినిమాలు ఆడలేదు. స్క్రిప్ట్‌ను ఎంచుకునే విధానంలో ఇప్పుడు కాస్త మార్పు వచ్చింది. ఇప్పుడు నచ్చలేదు అంటే నచ్చలేదు అని చెప్పే ధైర్యం వచ్చింది. ఏౖమైనా అంటే.. ‘చూశారు కదండీ.. నా ఆరు సినిమాల రిజల్ట్’ అని చెప్పొచ్చు. కథ పట్ల పూర్తి సంతృప్తిగా ఉంటేనే సినిమా చేయడానికి ఒప్పుకుంటున్నాను. భవిష్యత్‌లోనూ ఇదే కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రిప్ట్ విని, డౌట్స్ ఉంటే చెబుతా. అంతే కానీ ఈ మార్పు కావాలి. ఫలానా డైలాగ్స్ మార్చాలి. నా బాడీకి ఇది సూట్ అవ్వవు అన్న అభ్యంతరాలు చెప్పను. కానీ సినిమా ఫెయిల్ అయితే అది నా బాధ్యతగా తీసుకుంటాను. ఎందుకంటే హీరోగా నేను ‘యస్’ అన్నప్పుడే సినిమా ముందుకు వెళ్తుంది. ► మాటిచ్చాను కాబట్టి కొన్ని సినిమాలు చేశాను. మాట ఇస్తే ఎలాగైనా నిలబడాలి. స్టార్టింగ్ స్టేజ్‌లో కథ విన్నప్పుడు నచ్చి, ఆ తర్వాత కొంతదూరం ట్రావెల్ చేసిన తర్వాత అది ఎక్కడికో వెళ్లిపోతుందని అనిపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ చాయిస్ లేదు. అప్పుడు సినిమా పూర్తి చేయాల్సిందే కదా. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడకపోతే ఆడియన్స్ రెస్పాన్స్, విమర్శకుల అభిప్రాయాలను విశ్లేషించుకుని నన్ను నేను మెరుగుపరచుకోవడానికి మరింత కష్టపడతాను. ► కథలో కంటెంట్ బాగుంటే సక్సెస్ అనేది ఎప్పుడైనా వస్తుంది. ఫెయిల్యుర్ వల్ల ఆగిపోతారనే ఫీలింగ్ ఎప్పుడూ నాకు లేదు. ప్రతి యాక్టర్‌కి ప్రతి శుక్రవారం తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఒక చాన్స్. దాన్ని నేను నమ్ముతాను. సక్సెస్ ఉన్నప్పుడు మన చుట్టూ గుంపు ఉంటుంది. సక్సెస్ దూరమైనప్పుడు ఇద్దరో ముగ్గురో ఉంటారు. ఈ ఇద్దరు ముగ్గురు మనం ఏ స్టేజ్‌లో ఉన్నా ఉంటారు. కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలు చేస్తాను. హిందీ చిత్రం ‘గల్లీభాయ్’ తెలుగు రీమేక్‌లో నేను నటిస్తానన్న వార్తల్లో నిజం లేదు. ► నా బ్రదర్ వైష్ణవ్ తేజ్‌ను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై హీరోగా ఇంట్రడ్యూస్ చేయడంలో నా ప్రమేయం లేదు. దర్శకులు బుచ్చిబాబు ప్రొడ్యూసర్స్‌ని కలిసి ముందుకు వెళ్లారు. హెయిర్ సర్జరీ కోసం, లైపోసక్షన్ కోసమే నేను యూఎస్ ట్రిప్ వెళ్లాననే ప్రచారం జరిగింది. అది నిజం కాదు. ‘విన్నర్’ సినిమా సమయంలో హార్స్‌రైడింగ్ వల్ల బాగా గాయపడ్డాను. ఆ గాయాలను పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. ఆ తర్వాత సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. ‘తేజ్ ఐ లవ్యూ’ సినిమా టైమ్‌కి జిమ్‌కి వెళ్లి కసరత్తులు చేస్తున్న టైమ్‌కి ఆ గాయాలు బాగా ఇబ్బంది పెట్టాయి. యూఎస్‌లోని స్పోర్ట్స్ ఫిజియో దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని అక్కడికి వెళ్లాను. అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా ఫిట్‌గా ఉన్నాను. -
భాగమతి దర్శకుడితో మెగా హీరో..!
కెరీర్ స్టార్టింగ్‌లో మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల తడబడుతున్నాడు. వరుస ఫ్లాప్‌లతో కెరీర్ కష్టాల్లో పడేసుకున్న ఈ మెగా హీరో తదుపరి చిత్రాలు జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి సినిమాలో నటిస్తున్న సాయి.. తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. పిల్ల జమీందార్ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అశోక్, ఇటీవల భాగమతితో మరో విజయాన్ని అందుకున్నాడు. ఈ దర్శకుడితో ఓ సినిమా చేసేందుకు సాయి ధరమ్ ఓకె చెప్పాడట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం చిత్రకరణ దశలో ఉన్న చిత్రలహరి సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
చిత్రలహరి... ఇది టీవీ ప్రోగ్రామ్ కాదు
‘చిత్రలహరి’... కేబుల్ టీవీ రాకముందు దూరదర్శన్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని ప్రోగ్రామ్. ప్రతి శుక్రవారం పసందైన పాటలతో టీవీలకు కళ్లప్పగించేలా చేసిన ఈ ప్రోగ్రామ్ పేరు మళ్లీ సీన్లోకొచ్చింది. అయితే చిన్నితెరపై కాదు.. ఈసారి పెద్ద తెరకొచ్చింది. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ వంటి హార్ట్ టచింగ్ మూవీస్ తెరకెక్కించిన కిశోర్ తిరుమల దర్శకత్వంలో నాని హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు ‘చిత్రలహరి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు ఫిల్మ్‌నగర్ సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో ఈ సినిమా సెట్స్‌కు వెళ్లనుందట. ప్రస్తుతం నాని ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది. అలాగే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో చేయనున్న మల్టీస్టారర్ సినిమా షూటింగ్‌ను ఫిబ్రవరి మొదటి వారంలో మొదలు పెట్టనున్నారు నాని. ఇలా సినిమా తర్వాత సినిమాలు ఒప్పేసుకుంటూ మోస్ట్ బిజీగా ఉన్నారీ సక్సెస్ఫుల్ హీరో. -
రామ్‌కు జోడి కుదిరింది..!
హైపర్ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ త్వరలోనే మరో సినిమాను ప్రారంభించనున్నాడు. నేను శైలజ సక్సెస్ తరువాత కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న రామ్, మరోసారి కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నాడు. ఉగాది సందర్భంగా ఈ నెల 29న ఈసినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ కు ప్లాన్ చేస్తున్న చిత్రయూనిట్ ప్రస్తుతం నటీనటుల ఎంపిక చేస్తోంది. రామ్ సరనస హీరోయిన్ గా ఇప్పటికే మేగా ఆకాష్ ను ఫైనల్ చేయగా.. తాజాగా లీడ్ హీరోయిన్ గా అనుపమా పరమేశ్వరన్‌ను ఫైనల్ చేసింది. టాలీవుడ్ లో వరుసగా సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తున్న అనుపమా, రామ్ కు కూడా సక్సెస్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు దర్శకనిర్మాతలు. -
పూరి దర్శకత్వంలో వెంకీ..?
డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్, సీనియర్ స్టార్ వెంకటేష్ హీరోగా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. టెంపర్ తరువాత పూరి తెరకెక్కించిన సినిమాలేవి, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోక పోవటంతో సీనియర్ హీరోల మీద దృష్టి పెట్టాడు. తన కెరీర్లో ఎక్కువగా యంగ్ హీరోలతోనే సినిమాలు చేసిన పూరి, నాగార్జున హీరోగా రెండు సినిమాలు చేశాడు. ఇప్పుడు మరోసారి సీనియర్ స్టార్ వెంటేష్‌తో సినిమాకు రెడీ అవుతున్నాడు. బాబు బంగారంతో డీసెంట్ హిట్ అందుకున్న వెంకటేష్, ప్రస్తుతం రీమేక్‌గా తెరకెక్కుతున్న గురు సినిమాలో నటిస్తున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా గురు రిలీజ్ కానుంది. ఈ సినిమా తరువాత నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా చేయనున్నాడు. అదే సమయంలో పూరి సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు వెంకీ. -
వెంకీకి జోడిగా మిత్రవింద
గోపాల గోపాల సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకటేష్, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో బాబు బంగారం సినిమాలో నటిస్తున్నాడు. భలే భలే మగాడివోయ్ సినిమా తరువాత మంచి ఫాంలో కనిపిస్తున్న మారుతి, వెంకీని ఫుల్‌లెంగ్త్ కామెడీ రోల్లో చూపించనున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తన నెక్ట్స్ సినిమాను కూడా లైన్లో పెడుతున్నాడు వెంకీ. బాబు బంగారం సినిమా పూర్తయిన వెంటనే నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమాకు అంగీకరించాడు. ఇప్పటికే కథా కథనాలు కూడా రెడీ అయిన ఈ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. మల్టీ డైమెన్షన్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడిగా కాజల్ నటించనుంది. ఇప్పటి వరకు కుర్ర హీరోలతో మాత్రమే జోడి కట్టిన ఈ బ్యూటీ తొలిసారిగా ఓ సీనియర్ హీరోతో నటిస్తున్నందుకు భారీ మొత్తాన్నే అందుకుంటుందన్న టాక్ వినిపిస్తోంది. -
'నేను శైలజ నా చివరి సినిమా'
ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన స్టార్ ప్రొడ్యూసర్ స్రవంతి రవికిశోర్ ఇక పై సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ప్రేమంట, మసాల, శివమ్ లాంటి డిజాస్టర్ల తరువాత నేను శైలజ సినిమాతో మంచి విజయం సాధించిన స్రవంతి రవికిశోర్, ఈ సినిమా సక్సెస్ మీట్‌తో తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక పై తాను నిర్మాణ రంగానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నానని తెలిపారు. స్రవంతి రవికిశోర్ నిర్మాణ రంగం నుంచి తప్పుకున్నా.. స్రవంతి మూవీస్ బ్యానర్ మాత్రం కొనసాగుతుందని తెలిపారు. రామ్ సోదరుడు కృష్ణ చైతన్య ఇక పై ఆ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలకు నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. త్వరలోనే నేను శైలజ లాంటి సూపర్ హిట్ సినిమాను అందించిన హీరో రామ్, డైరెక్టర్ కిశోర్ తిరుమలల కాంబినేషన్లో మరో సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు, ఈ సినిమాతోనే కృష్ణ చైతన్య నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడు.