లవ్‌లో సస్పెన్స్‌! | narada donoruda is a suspense movie | Sakshi
Sakshi News home page

లవ్‌లో సస్పెన్స్‌!

Published Sat, Oct 21 2017 6:31 AM | Last Updated on Sat, Oct 21 2017 6:31 AM

narada donoruda is a suspense movie

ఆ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. జీవితం చాలా అందంగా సాగుతోంది. ఇంతలో చిన్న కుదుపు. ఆ చిన్ని సంఘటన ఇద్దరి జీవితాల్లో పెను మార్పుకు కారణం అవుతుంది. అదేంటి? అనేది తర్వాత చెబుతామంటున్నారు నవీన్‌చంద్ర. ‘అందాల రాక్షసి’తో మంచి పేరు తెచ్చుకుని, వరుసగా సినిమాలు చేస్తోన్న నవీన్‌ ప్రస్తుతం ఓ లవ్‌స్టోరీలో నటిస్తున్నారు. ఇందులో శాలిని వడినికట్టి కథానాయిక.

‘క్షణం’ చిత్రం సహదర్శకుడు, ‘నరుడా డోనరుడా’ సినిమా లైన్‌ ప్రొడ్యూసర్‌ అయిన అనిల్‌ విశ్వనాథ్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సాయి అభిషేక్‌ నిర్మాత. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కొత్త కథ, సరికొత్త కథనంతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రేమకథా చిత్రమైనా ప్రేక్షకుల ఉహకందని సస్పెన్స్‌ ఉంటుంది. ఖర్చు, నాణ్యత విషయంలో పెద్ద సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా రూపొందిస్తున్నాం. 80% చిత్రీకరణ పూర్తయింది. దాదాపు 40% షూటింగ్‌ విదేశాల్లో చిత్రీకరించాం’’ అన్నారు. ఈ సినిమాకి సంగీతం: శ్రవణ్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement