వెండితెరకు ద్యుతీ జీవితం | National Award-winner Himansu Khatua to Direct the Dutee Chand Biopic | Sakshi
Sakshi News home page

వెండితెరకు ద్యుతీ జీవితం

Published Tue, Dec 3 2019 6:13 AM | Last Updated on Tue, Dec 3 2019 6:13 AM

National Award-winner Himansu Khatua to Direct the Dutee Chand Biopic - Sakshi

అథ్లెట్‌ ద్యుతీ చంద్‌

బాక్సాఫీస్‌ వద్ద స్పోర్ట్స్‌ పర్సనాలిటీస్‌ బయోపిక్స్‌కు మంచి వసూళ్లు ఉంటాయి. ‘భాగ్‌ మిల్కా భాగ్‌ (2013), మేరీకోమ్‌ (2014), దంగల్‌ (2016)’ వంటి చిత్రాల రికార్డు కలెక్షన్లే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ ‘సైనా’ పేరుతో తెరకెక్కుతోంది. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా బయోపిక్స్‌పై ప్రకటనలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అథ్లెట్‌ ద్యుతీ చంద్‌ బయోపిక్‌ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి జాతీయ అవార్డుగ్రహీత హిమాన్షు ఖతువా దర్శకత్వం వహిస్తారు.

‘‘ఎన్నో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు నా బయోపిక్‌ను నిర్మించడానికి సంప్రదింపులు జరిపాయి. కానీ, నేను ఎవరికీ హక్కులు ఇవ్వలేదు. హిమాన్షుగారి ప్రతిభ గురించి నాకు తెలుసు. నా కథకు న్యాయం చేయగలరనే నమ్మకం ఉంది. ఈ బయోపిక్‌ను కేవలం ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫిల్మ్‌గానే కాదు.. చూసినవారు కూడా స్ఫూర్తి పొందేలా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు ద్యుతీ చంద్‌. ‘‘ఫస్ట్‌ డ్రాఫ్ట్‌ స్కిప్ట్ర్‌ వర్క్‌ పూర్తయింది. ద్యుతి చిన్నతనం నుంచి ఆమె జీవితంలోని ఎత్తుపల్లాలను కూడా సినిమాలో చూపిస్తాం. ద్యుతీగా ఎవరు నటించబోతున్నారనే విషయంపై త్వరలో చెబుతాం’’ అని పేర్కొన్నారు హిమాన్షు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement