నయనతార సన్యాసం? | nayanatara will change is nun Kollywood Talk ? | Sakshi
Sakshi News home page

నయనతార సన్యాసం?

Published Mon, Jan 12 2015 8:41 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM

నయనతార సన్యాసం?

నయనతార సన్యాసం?

 కోలీవుడ్‌లో ప్రస్తుతం ఒక ఆశ్చర్యకరమైన చర్చ సాగుతోంది. అదేమిటంటే నయనతార సన్యాసం స్వీకరించాలని తలుస్తున్నారట. నిజానికి నయనతార నట జీవితం ఉజ్వలంగా సాగుతోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లోను సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతున్న అరుదైన నటీమణుల్లో ఒకరీమె. రాజారాణి, ఆరంభం, ఇదు కదిర్‌వేల్ కాదల్ లాంటి చిత్రాల విజయాలు నయనతారకు సెకండ్ ఇన్నింగ్‌లో చాలా హెల్ప్ అయ్యాయి. ఈ మధ్య వచ్చిన అన్భే నీ ఎంగే చిత్రం నిరాశ పరచినా నటిగా ఆమె కెరీర్‌కు ఎలాంటి ఢోకా లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఈ సంచలన నటి సూర్యతో మాస్, ఉదయనిధి సరసన నన్భేండా, జయంరవికి జంటగా తనీ ఒరువన్ చిత్రాలతో పాటు లేడి ఓరియంటెడ్ చిత్రం మాయ  చేస్తూ బిజీగా వున్నారు.
 
 అయితే వ్యక్తిగత జీవితంలో ఈ బ్యూటీ రెండు మూడుసార్లు ప్రేమలో ఓడిపోయారు. నటుడు శింబు, ప్రభుదేవాలతో ప్రేమ కథలు కంచికి చేరడంతో విరక్తి చెందిన నయనతార ప్రేమ, పెళ్లి వద్దు అని సన్యాసం స్వీకరించాలనే నిర్ణయానికి వచ్చారా అనే వార్త ప్రచారంలో ఉంది. ఇది చిత్ర పరిశ్రమను విస్మయం కలిగించిన వార్త. అంతేకాదు ఏడాది క్రితం ఈ భామ హిమాలయాలకు వెళ్లి అక్కడి సన్యాసులతో మాట్లాడి మనశ్శాంతి పొందారట. ఇంతకుముందు బాలీవుడ్ బ్యూటీ తనుశ్రీ దత్తా, కోలీవుడ్ నటి రాగసుధ లాంటి వారు సన్యాసం పుచ్చుకున్నారు.
 
 అయితే నటి రాగసుధ మాత్రం మళ్లీ మనసు మార్చుకుని ఇటీవల నటుడు రంజిత్‌ను వివాహం చేసుకుని సంసార జీవితం అనుభవిస్తున్నారు. జీవితం లో పలు ఒడిదుడుకులను చవి చూసిన నయనతార సన్యాసం స్వీకరించాలని భావిస్తున్నట్లు కోలీవుడ్ టాక్. ఇటీవల ఆమె చిత్రాలను తగ్గించుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement