ఆ పాటకు భలే రెస్పాన్స్‌! | Nayantara is a movie producer who is getting good support for the song. | Sakshi
Sakshi News home page

ఆ పాటకు భలే రెస్పాన్స్‌!

Published Mon, Oct 9 2017 5:45 AM | Last Updated on Mon, Oct 9 2017 5:45 AM

Nayantara is a movie producer who is getting good support for the song.

తమిళసినిమా: నయనతార చిత్రంలో ప్రేమించొద్దు పాటకు అమోఘ ఆదరణ లభిస్తోందంటున్నారు ఆ చిత్ర నిర్మాత. ప్రస్తుతం నటి నయనతారకున్న ఇమేజే వేరు. కథానాయకి చుట్టూ తిరిగే పాత్రలో నటిస్తూ ఆ చిత్రాల వ్యాపారాలకు క్రేజ్‌ తీసుకొస్తున్న నటి నయనతార. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఆ తరహా చిత్రాల్లో ఇమైకా నోడిగళ్‌ ఒకటి.యువ నటుడు అధర్వ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో నటి రాశీఖన్నా కథానాయకిగా నటిస్తోంది. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్యామియో ఫిలింస్‌ పతాకంపై సీజే.జయకుమార్‌ నిర్మిస్తున్నారు.

హిప్‌హాప్‌ తమిళా సంగీత బాణీలు కడుతున్న ఇమైకా నోడిగళ్‌ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుని, నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ చిత్రంలో కాదలిక్కాదే( ప్రేమింయచొద్దు) అనే పాటను ఇటీవల చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అమోఘ ఆదరణ లభిస్తోందని నిర్మాత వెల్లడించారు.  హీరో తన ప్రేమ దూరం అవడానికి కారణమైన స్నేహితుడిపై అక్కసుతో ప్రేమించొద్దని పాడతాడన్నారు. చిత్రంలో ఈ పాట చాలా కొత్తగా ఉండాలని భావించిన దర్శకుడు, సంగీతదర్శకుడు జనరంజకంగా రూపొందించారని చెప్పారు. చిత్ర టీజర్, సింగిల్‌ సాంగ్‌తోనే ఇమైకా నోడిగళ్‌ చిత్రానికి ఇంత మంచి రెస్పాన్స్‌ రావడంతో చిత్రంపై అంచనాలు మరింత పెరుగుతున్నాయన్న సంతోషాన్ని నిర్మాత సీజే.జయకుమార్‌ వ్యక్తం చేశారు. త్వరలోనే చిత్ర విడుదల వివరాలను వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement