మరో హారర్ మూవీలో! | Nayanthara's upcoming horror film directed | Sakshi
Sakshi News home page

మరో హారర్ మూవీలో!

Published Sun, Feb 28 2016 11:25 PM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

మరో హారర్ మూవీలో!

మరో హారర్ మూవీలో!

అనామిక, మయూరి వంటి ఫిమేల్ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి, సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోయగలనని నిరూపించుకున్నారు నయనతార. ‘మయూరి’ తర్వాత ఆమె తాజాగా మరో హారర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ హీరోయిన్ ఓరి యంటెడ్ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. మానస్ రుషి ఎంటర్‌ప్రెజైస్ పతాకంపై మురుగదాస్ రామస్వామి దర్శకత్వంలో కె. రోహిత్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు.
 
 ‘‘ఈ సినిమాలో నేను భయపెట్టేటట్లు ఈ మధ్యకాలంలో మరే చిత్రం ప్రేక్షకుల్ని భయపెట్టి ఉండదేమో. ఈ చిత్రం తర్వాత మరో హారర్ సినిమా నేను వెంటనే చేయకపోవచ్చేమో. నా కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచే చిత్రమిది. తప్పకుండా అందరినీ అలరించేలా ఉంటుంది’’ అని నయనతార చెప్పారు. తంబిరామయ్య, హరీష్ ఉత్తమన్, మన్సూర్ ఆలీఖాన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్ మెర్లిన్, కెమేరా: దినేష్ కృష్ణన్, సహ నిర్మాతలు: సజ్జూభాయ్-రాంప్రసాద్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement