రామ్ సరసన నేహాశర్మ సోదరి
‘చిరుత’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఉత్తరాది భామ నేహా శర్మ గుర్తుంది కదా? ఇప్పుడామెను ఎందుకు గుర్తు చేసుకోవాలీ అనుకుంటున్నారా? మరేం లేదు... నేహా శర్మ చెల్లెలు ఐషా శర్మ కూడా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ప్రస్తుతం రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో ఐషాని నాయికగా తీసుకున్నారు. కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్ పతాకంపై శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకోవడం గురించి ఐషా శర్మ చెబుతూ - ‘‘కథానాయిక కావాలన్నది నా కల. అందుకే నటనలో శిక్షణ తీసుకున్నాను. డాన్స్ కూడా నేర్చుకున్నాను. ఈ చిత్రం కోసం ఆడిషన్స్‌లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చాను. సెలక్ట్ అవుతానో లేదో అనుకున్నాను. ఫైనల్‌గా ఈ అవకాశం దక్కించుకున్నా. రామ్ మంచి నటుడు. ఈ చిత్రకథ కూడా చాలా బాగుంది. ఈ చిత్రానికి అవకాశానికి రావడం నా అదృష్టం’’ అని తెలిపారు.