
నిధీ అగర్వాల్
నిధీ అగర్వాల్ నెక్ట్స్ కొన్ని రోజులు చెన్నైని చుట్టొచ్చే ప్లాన్‌లో ఉన్నారు. పర్సనల్ ట్రిప్ కోసం కాదు ప్రొఫెషనల్ ట్రిప్పే. తమిళ ఇండస్ట్రీ ఈ బెంగళూరు బ్యూటీకి స్వాగతం పలికింది. అందుకే నెక్ట్స్ కొన్ని రోజులు చెన్నైలో మకాం వేయబోతున్నారు. బాలీవుడ్‌లో ‘మున్నా మైఖేల్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు ని«ధి. ఆ తర్వాత ‘సవ్యసాచి, మిస్టర్ మజ్ను’ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించారు. ప్రస్తుతం రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చేస్తున్నారు. లేటెస్ట్‌గా ‘జయం’ రవి 25వ చిత్రంలో హీరోయిన్‌గా నిధీ అగర్వాల్ ఎంపిక అయ్యారు. తమిళంలో నిధీకి ఇదే తొలి సినిమా. లక్ష్మణ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment