
నిఖిల్, నివేథా థామస్ జంటగా కిషేన్ కట్టా దర్శకత్వంలో తేజు ఉప్పలపాటి, హరిణికేష్ రెడ్డి నిర్మిస్తున్న ‘శ్వాస’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పి.కిరణ్, సీనియర్ నరేశ్ కెమెరా సిచ్ఛాన్ చేయగా, హీరో శర్వానంద్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. నిఖిల్ మాట్లాడుతూ– ‘‘నేను సాధారణంగా యువదర్శకులతో సినిమాలు చేస్తుంటాను. ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్ కిషేన్‌తో కలిసి పని చేయడానికి సిద్ధమయ్యాను.
మంచి సినిమాలను తీసుకొచ్చే ప్రయత్నంలో నేను చేస్తున్న మరో మంచి ప్రయత్నమిది. ఈ చిత్రంలో నా పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి’’ అన్నారు. హీరో నిఖిల్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ఓ మంచి జర్నీలా సాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కిషేన్. ‘‘కిషేన్ మాకు మంచి మిత్రుడు. మంచి స్క్రిప్ట్ కుదరడంతో ఈ సినిమా చేయడానికి రెడీ అయ్యాం. ఇందులో నిఖిల్‌గారిని ఛాలెంజింగ్ రోల్‌లో చూస్తారు’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఇండియన్ సినిమాకి చాన్స్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు విదేశీ కెమెరామేన్ ఇస్తావస్ లెట్టాంగ్. ఈ చిత్రానికి సంగీతం: హరిణికేష్.
Comments
Please login to add a commentAdd a comment