నిఖిల్‌ పెళ్లి మరోసారి వాయిదా.. | Nikhil Siddharth Postpones His Wedding Second Time | Sakshi
Sakshi News home page

నిఖిల్‌ పెళ్లి మరోసారి వాయిదా..

Published Sun, May 3 2020 3:29 PM | Last Updated on Fri, May 15 2020 8:51 PM

Nikhil Siddharth Postpones His Wedding Second Time - Sakshi

హైదరాబాద్‌ : హీరో నిఖిల్‌ వివాహం మరోసారి వాయిదా పడింది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఇదివరకు ఒకసారి తన పెళ్లిని వాయిదా వేసుకున్న నిఖిల్‌.. తాజాగా మరోసారి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సారి పెళ్లి తేదీని మాత్రం నిఖిల్‌ ప్రకటించలేదు. ఇలా జరగడంపై ఆయన తీవ్ర నిరుత్సాహనికి గురయ్యారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిఖిల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. 

‘కరోనాతో పోరాటం ముగిసే వరకు మా పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాం. బయట చాలా మంది పడుతున్న బాధలతో పోలిస్తే.. నేను పడుతున్న బాధ పెద్దది కాదు. నా పెళ్లి జరిగే సమయంలో ఒక్క వ్యక్తికి కూడా కరోనా సోకినా.. ఆ బాధ నన్ను జీవితం మొత్తం వేధిస్తోంది. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా మరుపురానిదిగా ఉంటుంది. కాబట్టి అది చాలా వేడుకగా జరుపుకోవాలి. ఇలాంటి కష్టకాలంలో పెళ్లి చేసుకోవడం సరైనది కాదని భావిస్తున్నాం. నేను, పల్లవి మా పెళ్లికోసం వేచి ఉంటాం. కరోనా ముగిశాక మేము చాలా వేడుకగా పెళ్లి చేసుకుంటాం’ అని తెలిపారు. 

కాగా, ఫిబ్రవరిలో డాక్టర్‌ పల్లవి వర్మతో నిఖిల్‌ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్‌ 16న వీరి వివాహం జరపాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. అయితే కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో నిఖిల్‌-పల్లవిల పెళ్లిని మే 14కు వాయిదా వేశారు. అయితే మరోసారి  మే 17 వరకు లాక్‌డౌన్‌ పొడిగించడంతో..  పెళ్లిని వాయిదా వేస్తున్నట్టు నిఖిల్‌ వెల్లడించారు. 

చదవండి : కాబోయే భార్య అలా ఉండాలి : విజయ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement