మా ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది! | Nisha aggarwal to marry in december | Sakshi
Sakshi News home page

మా ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది!

Published Wed, Dec 18 2013 1:30 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

మా ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది! - Sakshi

మా ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది!

 ‘‘నాకూ నా కుటుంబానికి ఆ రోజు చాలా ముఖ్యం. మాకెప్పటికీ గుర్తుండిపోయే ఓ తీపి జ్ఞాపకంగా ఆ రోజుని చెప్పొచ్చు’’ అంటున్నారు కాజల్ అగర్వాల్. ఈ బ్యూటీ చెబుతున్నది ఈ నెల 28 గురించి. ఆ రోజు కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ పెళ్లి కరణ్ వలేచాతో జరగబోతోంది. పెద్దలు సమ్మతంతో నిషా చేసుకోబోతున్న ప్రేమ వివాహం ఇది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తానంటే కరణ్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట. కాబట్టి, నిషా హీరోయిన్‌గా కంటిన్యూ అవుతారు. ఇదిలా ఉంటే తన చెల్లెలి పెళ్లి సందర్భంగా కాజల్ అగర్వాల్ మాట్లా డుతూ -‘‘నా కళ్ల ముందే పెరిగిన నా చిన్నారి చెల్లెలు తన జీవిత భాగస్వామిని ఎన్నుకునేంత ఎత్తుకు ఎదిగినందుకు సంతోషంగా ఉంది.

తన సంతోషమే మా సంతోషం. ఈ 28న ముంబయ్‌లో వివాహ వేడుక జరగనుంది. మాకో ‘ఎమోషనల్ డే’ అది. మా ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది. పెళ్లి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. చెల్లెలి పెళ్లికి సంబంధించిన పనులను దగ్గరుండి చేయడం ఓ కొత్త అనుభూతినిస్తోంది. ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చి నేనూ నా చెల్లెలు సినిమాలు చేస్తున్నాం. ఇక్కడివాళ్లు మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. అలాగే, నా చెల్లెలి జీవితం బాగుండాలని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement