
టాలీవుడ్ చందమామ కాజల్ మరో మూడు రోజుల్లో పెళ్లికూతురిగా ముస్తాబు కానుంది. అక్టోబర్ 30న తన ప్రియుడు, బిజినెస్‌మెన్ గౌతమ్ కిచ్లుతో ఏడడుగులు నడవనుంది. అయితే పెళ్లికి ఒక రోజు ముందు అక్టోబర్ 29న హల్దీ(పసుపు ఫంక్షన్), మెహందీ వేడుకను నిర్వహిస్తున్నామని కాజల్ సోదరి నిషా అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కేవలం దగ్గరి బంధువులు, తక్కువ మంది స్నేహితుల సమక్షంలోనే ఈ వేడుక జరుపుతున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో నిబంధనలను పాటిస్తూనే సెలబ్రేట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. (చదవండి: కొత్త ఇంటిని సెట్ చేసుకుంటున్న చందమామ)
పెళ్లి రోజు సంగీత్ ఏర్పాటు చేస్తున్నామని, పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ సంతోషాన్ని పంచుకోబోతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. పెళ్లి తర్వాత కూడా అక్క తన సినిమాల ద్వారా అభిమానులను అలరిస్తుందని మామీ ఇచ్చారు. ఇక కాజల్‌కు కాబోయే వరుడి గురించి మాట్లాడుతూ.. 'గౌతమ్ చాలా మంచి వ్యక్తి. మా కుటుంబంలోకి అతడు అడుగుపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తమ ప్రేమ కథ గురించి కాజలే స్వయంగా ముందుకు వచ్చి ఈ ప్రపంచానికి చెప్తుంది' అని తెలిపారు. కాగా కాజల్ కుటుంబసభ్యులు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే కాబోయే వధూవరులు మాత్రం కొత్త ఇంటిని సర్దుకునే పనిలో ఉన్న విషయం తెలిసిందే. (చదవండి: చార్మీ తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్)
Comments
Please login to add a commentAdd a comment