Kajal Aggarwal Son Name: Nisha Agarwal Announce Kajal Aggarwal Son Name As 'Neil Kitchlu' - Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: కాజల్‌ కొడుకు పేరు ఏంటో తెలుసా?

Published Wed, Apr 20 2022 12:54 PM | Last Updated on Wed, Apr 20 2022 2:11 PM

Nisha Agarwal Announce Kajal Aggarwal Son Name - Sakshi

Kajal Aggarwal Son Name: స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ మం‍గళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం వారికి మగ బిడ్డ పుట్టినట్లు తాజాగా కాజల్‌ భర్త గౌతమ్‌ కిచ్లు, ఆమె సోదరి నిషా అగర్వాల్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకుగౌతమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేశాడు. అలాగే నిషా అగర్వాల్‌ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్‌ చేసింది. ఈ సందర్భంగా తమ కుమారుడి పేరు నీల్‌ కిచ్లుగా గౌతమ్‌ ధృవీకరించాడు. 

చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌!

కాగా ఈ ఏడాది జనవరిలో కాజల్‌ తన ప్రెగ్నెన్సీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బేబీ బంప్‌ ఫొటోలను, భర్త గౌతమ్‌ కలిసి బేబీ బంప్‌ ఫొటోషూట్‌లను షేర్‌ చేస్తూ వచ్చింది. ఇక 2020 అక్టోబర్‌ 30న తన స్నేహితుడు, ముంబై వ్యాపారవేత్త అయిన గౌతమ్‌ కిచ్లును కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

చదవండి: కొత్త జంటకు రణ్‌బీర్‌ తల్లి కళ్లు చెదిరే ఫ్లాట్‌ గిఫ్ట్‌, ఖరీదెంతంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement