
చందమామ కాజల్ అగర్వాల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ నెల 30న తన స్నేహితుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం ఈ జంట తమ కొత్త ఇంటిని సర్దుకునే పనిలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘మా కొత్త ఇంటిని సర్దుకుంటున్నాం.. ఏమైనా సలహాలు ఇవ్వగలరా’ అంటూ నెటిజనులను అడిగారు. అంతేకాక ‘మిస్టర్‌ని కూడా కనుక్కొండి’ అంటూ కొత్త ఇంటి పనులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు కాజల్. ముంబై వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని అక్టోబర్ 30న పెళ్లాడనున్నట్టు కాజల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానిస్తున్నట్టు చెప్పింది. తన సినీ ప్రయాణంలో మద్దతుగా నిలిచి ఆదరించిన ప్రతీ ఒక్కరికీ కాజల్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ముందు కూడా తనను ఆదరిస్తారిస్తారని చందమామ బ్యూటీ ఆకాక్షించారు. కొంతకాలంగా గౌతమ్ కిచ్లు, అగర్వాల్ మధ్య నడిచిన స్నేహం ప్రేమగా మారినట్టు తెలుస్తోంది. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగినట్టు సమాచారం. (చదవండి: కాజల్ ఇల్లే వేదికగా...)
అక్టోబర్ 30న జరిగే వివాహ వేడుకకు కేవలం 20 మంది మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం. కాజల్ ఇంట్లోనే పెళ్లి వేడుక జరగనుంది. కేవలం కుటుంబ సభ్యుల మాత్రమే ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఇక "ఈ మహమ్మారి ఖచ్చితంగా మా ఆనందానికి గంభీరమైన వెలుగునిచ్చింది, కాని మేము కలిసి మా జీవితాలను ప్రారంభించబోతున్నందుకు సంతోషిస్తున్నాము. మీరందరూ ఈ సంతోష సమయంలో మమ్మల్ని ఉత్సాహపరుస్తారని అశిస్తున్నాను" అని కోరారు కాజల్.
Comments
Please login to add a commentAdd a comment