కాజల్‌ నో చెప్పింది ఇందుకే.. | Kajal Tweet Draws Attention Of Fans | Sakshi
Sakshi News home page

కాజల్‌ నో చెప్పింది ఇందుకే..

Nov 3 2020 8:52 PM | Updated on Nov 3 2020 8:59 PM

Kajal Tweet Draws Attention Of Fans - Sakshi

ఒక్కోసారి సెలబ్రిటీల ట్వీట్‌లు అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెబితే కిక్‌ ఏముంటుందని తికమక పెడుతూ ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేస్తుంటారు. ఈరోజు కాజల్‌ చేసిన ట్వీట్‌ చూస్తే అలాగే అనిపిస్తోంది. కోవిడ్‌ గురించి స్పందిస్తూ ‘‘నాకు తెలుసు నేను చాలా ఆలస్యం చేశానని, ఇది ఎప్పుడో చేయాల్సింది’’ అంటూ ఒక లెటర్‌ రూపంలో ఆమె భావాలను పంచుకున్నారు.

‘ఒక చిన్న వైరస్‌ నేను ప్రపంచాన్ని చూసే దృష్టికోణాన్నే మార్చేస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. భయంతో బతకడం తప్ప ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ప్రపంచాన్ని చూస్తుంటే నేను జీవితాన్ని చూస్తున్న దృక్పధమే మారిపోయింది. నేను జీవిస్తున్న ప్రస్తుత పరిస్థితికి, ఇలాంటి భయానికి నో చెప్తున్నాను. వైరస్ తో పోరాటం మొదలుపెట్టి ఇప్పటికే 11 నెలలు అయ్యింది. ఇంతకంటే మెరుగైన జాగ్రత్తలు అందరం తీసుకోవాలి. మనం ఈరోజు తీసుకుంటున్న నిర్ణయాల మీదే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నేను నా కొత్త జీవితంలోకి అడుగుపెట్టే ముందు ఇదంతా మీతో పంచుకోవాలనుకున్నాను. సురక్షిత ప్రపంచానికి మాత్రమే నేను ప్రాధాన్యం ఇస్తాన‘ అని ట్వీట్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement