ఓ క్యాబ్ డ్రెవర్ గత 48 గంటల్లో తనే అతని మొదటి కస్టమర్ అని చెప్పిన తీరు తనని కలిచి వేసిందంటూ నటి కాజల్ అగర్వాల్ భావోద్వేగానికి లోనయ్యారు. కరోనా వైరస్ (కోవిడ్-19)... రోజూవారి కూలీల జీవితాలను ఎంతగా దెబ్బతీస్తోందో తనకు ఎదురైన తాజా సంఘటనను బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘ఈ రోజు క్యాబ్‌లో బయటకు వెళ్లాను. ఆ క్యాబ్ డ్రైవర్ గత రెండు రోజుల నుంచి నేనే అతని మొదటి కస్టమర్ అని చెప్పాడు. ఈ రోజు ఇంట్లోకి కూరగాయలు, వంట సామాగ్రి తీసుకోస్తానని నా భార్య ఎదురు చూస్తుందేమో అని బాధపడ్డాడు’ అంటూ కాజల్ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.(అల్లరి నరేష్‌కు జోడీగా కాజల్!)
(చదవండి: బర్త్‌డే వేడుకలు క్యాన్సిల్ చేసిన చెర్రీ)
కాగా.. ‘‘అతని పరిస్థితి చూస్తే నాకు జాలేసింది. దీంతో అతనికి అదనంగా రూ. 500 ఇచ్చాను. అయితే ఇది మనకు చిన్న విషయమే అయ్యిండచ్చు. కానీ దానితో వారి అవసరాలు తీరుతాయి కదా. అలాగే మీకు.. వీధి విక్రేతలు కానీ, క్యాబ్ డ్రైవర్లు లేదా ఇలాంటి వారెవరైనా తారసపడితే దయచేసి వారికి కాస్తా ఎక్కవ డబ్బు చెల్లించి సాయం చేయండి. ఒకవేళ మీరే వారి చివరి కస్టమర్ అయ్యుండచ్చు’’ అని కూడా చెప్పారు. కాజల్ పోస్టుకు ‘తప్ప కుండా మా వంతు సాయం చేస్తాం’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
కరోనా: నటుడు ప్రియదర్శి హోమ్ క్వారంటైన్!
కాగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో... ఈ మహమ్మారి ఎప్పుడు, ఎలా, ఎవరికి సోకుందో అర్థం కావడం లేదు. దీంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని విద్యాసంస్థలను, షాపింగ్ మాల్స్, సినిమా థీయోటర్లను, రెస్టారెంట్లను మూసివేసిన సంగతి తెలిసిందే. దీనివల్ల ప్రజలు, వ్యాపారులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక ముఖ్యంగా రోజు వచ్చే డబ్బుతో ఇంటిని నెట్టుకొస్తోన్న ఎంతోమందికి కూలీలకు పని లేకుండా పోవడంతో వారి జీవితాలు కష్టతరంగా మారాయి. దీంతో కరోనా ప్రభావం బడుగుల జీవితాలపైఎంతగా ప్రభావం చూపుతోందో ఈ తాజా సంఘటనతో మరోమారు బుజువైంది.
Comments
Please login to add a commentAdd a comment