నితిన్ కొత్త సినిమా అప్ డేట్స్ | nithin hanu ragavapudi movie updates | Sakshi
Sakshi News home page

నితిన్ కొత్త సినిమా అప్ డేట్స్

Published Wed, Oct 5 2016 1:40 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

నితిన్ కొత్త సినిమా అప్ డేట్స్

నితిన్ కొత్త సినిమా అప్ డేట్స్

అ..ఆ.. సినిమాతో 50 కోట్ల క్లబ్లో చేరిన యంగ్ హీరో నితిన్, తన నెక్ట్స్ సినిమాతో కూడా అదే ఫాం కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా ప్రకటించిన నితిన్, ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

కృష్ణగాడి వీర ప్రేమగాథ సక్సెస్తో మంచి జోష్లో ఉన్న దర్శకుడు హను రాఘవపూడి.., నితిన్ సినిమాను కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ 90 శాతం వరకు ఫారిన్లోనే చేసేలా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి 2017 సమ్మర్లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement