
జై లవ కుశ చిత్రం విజయంతో నటి నివేధితా థామస్ తెగసంబర పడుతున్నారు. తాను నటించి మూడు చిత్రాలు హిట్ చేసినందుకు అభిమానులకు ట్విట్టర్‌లో ఓ లేఖ పోస్ట్ చేసి కృతజ్ఞతలు తెలిపారు.
'ఒక్క సినిమా హిట్ అవ్వడం స్పెషల్. నా మొదటి మూడు చిత్రాలని ఆదరించారు. తెలుగు చిత్రపరిశ్రమలో 'మా అమ్మాయి' అని పిలవడం కన్నా పెద్ద అభినందన ఏమీ ఉండదు. అది నా అదృష్టంగా భావిస్తున్నా. నా అభిమానులు, కుటుంబ సభ్యులు అయిపోయారు. మీకు ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే. జై లవ కుశని ఇంత బాగా ఆదరించినందుకు కృతజ్ఞతలు. మరో చిత్రంలో ఓ మంచి పాత్రతో మీ ముందుకు వస్తా' అని ప్రేమతో మీ నివేధితా థామస్ అంటూ లేఖలో పేర్కొన్నారు.
Thank you all :) pic.twitter.com/PiwN5n1Xge
— Nivetha Thomas (@i_nivethathomas) 23 September 2017