బాలీవుడ్ లో అసహనమా? | No intolerance in Bollywood, says Kajol Jaipur | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ లో అసహనమా?

Published Sat, Jan 23 2016 2:54 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బాలీవుడ్ లో అసహనమా? - Sakshi

బాలీవుడ్ లో అసహనమా?

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ దేశంలో అసహనంపై సంచలన వ్యాఖ్యలు చేసి ఒక్క రోజు కూడా గడవక ముందే, బాలీవుడ్ నుంచే ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ వచ్చింది. అది కూడా కరణ్ స్నేహితురాలు, ప్రముఖ హీరోయిన్ కాజోల్ నుంచి రావటం హాట్ టాపిక్గా మారింది. గతంలో అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ లాంటి వారు దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ కామెంట్ చేసి విమర్శల పాలయ్యారు.

ఈ నేపథ్యంలో కాజోల్ ' బాలీవుడ్లో అసహనం లాంటిదేమి లేదు. సినీరంగం ప్రతి ఒక్కరికీ స్వాగతం పలుకుతుంది. ఇక్కడ కులం, మతం లాంటి అడ్డుగోడలేమి లేవు.' అంటూ తన అభిప్రాయాన్ని తెలిపింది. జైపూర్లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొన్న ఆమె ఈ విధంగా స్పందించింది. అదే వేదికపై కరణ్ భారత్లో ప్రజాస్వామం పెద్ద జోక్ అంటూ కామెంట్ చేయటం, తరువాత ఆ వ్యాఖ్యలపై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు స్పందించటం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement