నాకు ఆ రిలేషన్లు అక్కర్లేదు: నటి | no need of relations in film industry, says Kangana Ranaut | Sakshi
Sakshi News home page

నాకు ఆ రిలేషన్లు అక్కర్లేదు: నటి

Published Sat, Jan 28 2017 10:37 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

నాకు ఆ రిలేషన్లు అక్కర్లేదు: నటి - Sakshi

నాకు ఆ రిలేషన్లు అక్కర్లేదు: నటి

ముంబై: వివాదాలు ఆమెకు కొత్తేమీ కాదు. అలాగని కేవలం వివాదాలతో వార్తల్లో నిలిచే వ్యక్తిత్వం ఆమెది కాదు. నటనలో జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ వివరాలను చూస్తే ఆ నటి మరెవరో కాదు బాలీవుడ్ 'క్వీన్' కంగనా రనౌత్ అని కచ్చితంగా చెప్పవచ్చు. హీరో హృతిక్ రోషన్‌తో కొంతకాలం నెరపిన ప్రేమాయణం బెడిసి కొట్టడంతో పాటు అందరూ ఆమెవైపే వేలెత్తిచూపారు. హృతిక్, కంగనా ఒకరిపై మరొకరు కేసులు వేసి, నోటీసులు పంపుకున్నారు. దీంతో ఆమె కాస్త డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు స్పష్టమవుతోంది. అయినా వెనకంజవేసే తత్వం తనది కాదని కంగనా ప్రవర్తిస్తోంది.

ఇండస్ట్రీలో ఎవరితోనూ సన్నిహితంగా ఉండవద్దని, బంధాలు ఏర్పరచుకోవద్దని కంగనా చెబుతోంది. ఫ్రెండ్స్, రిలేషన్స్ అంటూ ఎవరినీ సన్నిహితులను చేసుకోవద్దని వాటి వల్ల తాత్కాలిక ఆనందమే మనకు దొరుకుతుందని తర్వాతి తరం నటులు ఈ ఫిలాసఫీ ఫాలో అయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని 'క్వీన్' బ్యూటీ అభిప్రాయపడింది. మనకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి సన్నిహితులేం అక్కర్లేదని, మనసుతో మాట్లాడితే అన్ని సమస్యలకు సొల్యూషన్ ఉంటుందని వేదాంతం చెప్పకొచ్చింది. ప్రస్తుతం ఆమె విశాల్ భరద్వాజ్ తెరకెక్కిస్తున్న రంగూన్‌లో నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement