సాక్షి, చెన్నై: తమిళనాడులో కొత్త సినిమాల విడుదల ఈ వారం నిలిచిపోయింది. జీఎస్టీకి మించిపోయేలా ఉన్న ద్వంద పన్నుల విధానాన్ని రద్దు చేయాలంటూ సినిమా థియేటర్ల యజమానులు బంద్ పాటిస్తున్నారు. ఫలితంగా శుక్రవారం విడుదల కావాల్సిన సినిమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోయాయి. దీనిపై తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ సంఘం అధ్యక్షుడు విశాల్ దీనిపై మాట్లాడుతూ.. జీఎస్టీతోపాటు లోకల్ బాడీ ఎంటర్‌టెయిన్‌మెంట్ టాక్స్ అంటూ మరో పదిశాతం పన్ను విధించటాన్ని తాము నిరసిస్తున్నామని తెలిపారు. ఈ పన్నుతో సినీ పరిశ్రమపై మరింత భారం పడుతుందని చెప్పారు. సైఫ్ అలీ ఖాన్ నటించిన షెఫ్, బ్లేడ్ రన్నర్ 2049 తో పాటు తమిళ సినిమా విజితిరు ఈ శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. దీంతో పాటు బిజోయ్ నంబియార్ తమిళ - మళయాళ సినిమా సోలో గురువారం రెండు రాష్ట్రాల్లో విడుదలయింది.
కానీ, శుక్రవారం ఆ సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. కాగా దర్శకుడు మీరా కత్తిరావన్ మాట్లాడుతూ.. శుక్రవారం తమ సినిమాను 250 థియేటర్లలో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని, ఇందుకు సంబంధించి ప్రచారం కోసం చేసిన శ్రమ, డబ్బు అంతా వృథా అయిందని తెలిపారు. ఈ నెల 18 వ తేదీన సూపర్‌స్టార్ విజయ్ సినిమా విడుదల కావాల్సి ఉండగా అంతకుమునుపే తమ సినిమా విడుదలకు ప్రణాళిక వేసుకున్నామన్నారు. సమ్మె కారణంగా ప్రస్తుతానికి వాయిదా పడిందని, అయితే వచ్చే వారం విడుదల చేసినా అంత సంఖ్యలో థియేటర్లు లభ్యం కాకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment