
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న అజ్ఞాతవాసి సినిమాకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఈ రోజు అర్ధరాత్రి ప్రీమియర్ షోలు వేసేందుకు అనుమతి నిరాకరించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అర్థరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 10 గంటల మధ్య ప్రత్యేక షో వేసేందుకు అనుమతించిన నేపథ్యంలో తెలంగాణాలోనూ ప్రీమియర్ షోలకు అనుమతి లభిస్తుందని భావించారు.
అయితే తొక్కిసలాట జరిగే అవకాశం ఉందన్న కారణంతో పోలీసులు ప్రీమియర్ షోలకు అనుమతి నిరాకరించారు. ఫ్యాన్స్ కోసం అర్థరాత్రి ప్రత్యేక షోలు వేసేందుకు భ్రమరాంభ, మల్లికార్జున, ఆర్కే థియేటర్లలో ఏర్పాట్లు చేశారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించటంతో రేపు ఉదయం (10-01-2018) ఎనిమిది గంటలకు తొలి షో పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment