సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఎవరి అభిమానుల గ్రూప్ వారికి ఉంటుంది. అసలే నాగబాబు-బాలయ్య వివాదం అగ్గిరాజేస్తుంటే.. ఎన్టీఆర్, వీవీఆర్ అంటూ అయితే గత రెండ్రోజులుగా నందమూరి, మెగా ఫ్యాన్స్ తాకిడి మరీ ఎక్కువైంది. మొన్న రిలీజైన ఎన్టీఆర్ కథానాయకుడిపై ట్రోలింగ్స్ హోరెత్తగా.. ఈరోజు రిలీజ్ అయిన రామ్‌చరణ్ ‘వినయ విధేయ రామ’పై ట్రోల్స్ ప్రారంభమయ్యాయి.
ఓల్డేజ్ ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ ఫర్వాలేదనిపించినా.. ఎన్టీఆర్ యువకుడిగా ఉన్న పాత్రలో బాలయ్య అరాచకంగా కనిపించాడని విమర్శలు వచ్చాయి. ఏదేమైనా యన్.టి.ఆర్ సినిమాకు కొంత డివైడ్‌టాక్ వచ్చేసింది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ బయోపిక్ మీద మాత్రం ట్రోలింగ్స్ ఆగడం లేదు. యువకుడిగా ఎన్టీఆర్ ఉండే సన్నివేశాల్లోనైనా జూ.ఎన్టీఆర్ యాక్ట్ చేస్తే బాగుండేదనే కామెంట్స్ వినిపించాయి.
ఇక నేడు (జనవరి 11) ప్రపంచవ్యాప్తంగా వినయ విధేయ రామ ప్రేక్షకుల ముందుకు రాగా.. సినిమా బాలేదని ఓ వైపు ట్రోల్స్ జరుగుతుండగా.. రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ మూవీ అంటూ మరోవైపు టాక్ ప్రచారం జరుగుతోంది. ఫ్యాన్స్ వారి అభిమాన హీరోల సినిమాలను ప్రమోట్ చేసుకుంటే ఏ బాధ లేదు కానీ, పక్కవారి సినిమాలపై అదే పనిగా ట్రోల్స్ చేస్తుండటంతో ఎంతో కొంత కలెక్షన్లపై ప్రభావం చూపుతోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి ‘వీవీఆర్’పై జెన్యూన్ టాక్ తెలియాలంటే ఇంకొంచెంసేపు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment