
వర్మకు ఒమర్ కౌంటర్
టీమిండియాపై దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలకు జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కౌంటర్ ఇచ్చారు.
న్యూఢిల్లీ: టీమిండియా ఓటమిపై దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలకు జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కౌంటర్ ఇచ్చారు. అన్ని వేళలా రామూ సినిమాలు కూడా అలాగే బ్లాక్ బ్లస్టర్ అవుతాయి కదా అంటూ వ్యంగ్య ట్వీట్ వదిలారు. వన్డే వరల్డ్ కప్ సెమీస్ లో టీమిండియా ఓడిపోవడం తనకు సంతోషంగా ఉందంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
వార్మప్ మ్యాచుల్లో టీమిండియా ప్రదర్శన చూసిన తర్వాత ధోని సేన నాకౌట్ కు వెళుతుందని ఊహించలేదని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. వరల్డ్ కప్ లో టీమిండియా బాగా ఆడిందని మెచ్చుకున్నారు. టీమిండియా ఓటమిపై కొంతమంది క్రికెట్ అభిమానులు చేస్తున్న అతివాద చర్యలను ఆయన ఖండించారు. అటువంటి వారిని అభిమానులు అనడం సరికాదని అభిప్రాయపడ్డారు.
No wonder your movies are such block buster hits all the time :-) https://t.co/r8WUm0amwQ
— Omar Abdullah (@abdullah_omar) March 26, 2015