ఆస్కార్ వేదికపై యాంకర్ ఇలా చేశారేమిటి? | Oscar award for Moonlight not La La Land | Sakshi
Sakshi News home page

ఆస్కార్ వేదికపై యాంకర్ ఇలా చేశారేమిటి?

Published Mon, Feb 27 2017 11:51 AM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM

ఆస్కార్ వేదికపై యాంకర్ ఇలా చేశారేమిటి?

ఆస్కార్ వేదికపై యాంకర్ ఇలా చేశారేమిటి?

లాస్ ఏంజిలిస్: ఆస్కార్‌ అవార్డులను చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకం భావిస్తారు. ఈ అవార్డు అందుకోవాలన్నది కళాకారులందరి కల. ప్రతి ఏటా అమెరికాలోని లాస్ ఏంజిలిస్‌లో జరిగే ఈ అవార్డుల ప్రదానోత్సవ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని చూసేందుకు సినీ ప్రముఖులే గాక కోట్లాది అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. ఈసారి భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఈ అవార్డుల వేడుక ప్రారంభమైంది. కేటగిరిలా వారిగా అవార్డులను ప్రకటిస్తున్నారు. ఉత్తమ చిత్రం కేటగిరి అవార్డును ప్రకటించాలి.

ఈ సమయంలో నిర్వాహకులు తప్పులో కాలేశారు. ఉత్తమ చిత్రంగా లా లా ల్యాండ్‌ను ప్రకటించారు. దీంతో ఆ సినిమా బృందం సంబరాలు చేసుకుంది. అయితే వారికి సంతోషం ఎంతోసేపు నిలవలేదు. పొరపాటు తెలుసుకున్న యాంకర్ సవరణ చెబుతూ ఉత్తమ చిత్రంగా మూన్‌లైట్‌ను ప్రకటించారు. అంతే లా లా ల్యాండ్ చిత్రం బృందం సంతోషం ఆవిరికాగా.. మూన్‌లైట్‌ బృందం సంబరాల్లో మునిగిపోయింది. సాధారణంగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది యాంకర్ ఏమరుపాటుతో తప్పుగా చదవడాన్ని కొందరు సినీ ప్రముఖులు తప్పుపట్టారు. బెస్ట్ మూవీ స్క్రీన్ ప్లే.. ఆస్కార్ 2017కు ఇవ్వాలని నటి శృతి హాసన్ ట్వీట్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement