Moonlight
-
ఇన్ఫోసిస్ ఉద్యోగులపై కొరడా: అతిక్రమిస్తే అంతే!
సాక్షి, ముంబై: టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. తమ అనుమతి లేకుండా పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకోవడానికి వీల్లేదంటూ అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు ఉద్యోగులకు సెప్టెంబరు 12న ఈమెయిల్ సమాచారాన్ని పంపింది. ఉద్యోగుల హ్యాండ్‌బుక్, ప్రవర్తనా నియమావళి ప్రకారం ద్వంద్వ ఉపాధికి అనుమతి లేదని స్పష్టం చేసింది. అంతేకాదు దీన్ని ఉల్లంఘించినవారికి టెర్మినేషన్ తప్పదని కూడా హెచ్చరించింది. వర్క్ ఫ్రం హోం విధానంలో మూన్‌లైటింగ్ (ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు)లు అనేది అంశంలో పెరుగుదల కనిపించిందని ఇన్ఫోసిస్ పేర్కొంది. తమ అనుమతి లేకుండా ఉద్యోగి ఏదైనా వ్యాపార కార్యకలాపాల్లో పూర్తి సమయం లేదా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇది ఉత్పాదకతపై ప్రభావం చూపడం తోపాటు, ఉద్యోగ పని తీరు, డేటా ప్రమాదం , రహస్య సమాచారం లీకేజీ వంటి తీవ్రమైన సవాళ్లు ఉత్పన్న మవుతాయని తెలిపింది. మరో టెక్ దిగ్గజం విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ఈ పద్ధతి మోసం అని వ్యాఖ్యానించిన కొన్ని రోజుల తర్వాత ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది. అయితే ఉద్యోగులకు ఇన్ఫోసిస్‌తో 9 గంటలు మాత్రమే పని చేయడానికి ఒప్పందం ఉంది. ఉద్యోగులు పనివేళల వెలుపల ఏమి చేస్తారు అనేది వారి ప్రత్యేక హక్కు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి పౌరునికి జీవనోపాధి పొందే హక్కును అందించింది, కాబట్టి ఉద్యోగులకు పంపే ఇటువంటి ఇమెయిల్‌లు చట్టవిరుద్ధం, అనైతికమని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ వాదిస్తోంది. ఉద్యోగులుఎంప్లాయి అగ్రిమెంట్, నిబంధనలకు కట్టుబడి ఉంటారని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్, ఆరిన్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు టీవీ మోహన్‌దాస్ పాయ్ ఇటీవల వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, కంపెనీ ఐపీని ఉపయోగించనంతవరకు కోరుకున్నది చేసుకునే హక్కు ఉంటుందన్నారు. అలాగే ఉద్యోగులు ఎందుకు మూన్‌లైట్‌ని కోరుకుంటున్నారో కంపెనీలు తెలుసుకోవాలని, వారికి తక్కువ వేతనం ఇస్తున్నామా అనేది చూసుకోవడం ముఖ్యమన్నారు. మార్కెట్ పోటీ, రోజురోజుకు పెరుగుతున్న అట్రిషన్‌తో ఇబ్బందులు పడుతున్న ఐటీ కంపెనీల్లో మూన్‌లైటింగ్ గుబులు పుట్టిస్తోంది. వర్క్-ఫ్రమ్-హోమ్ చేసే ఉద్యోగుల్లో 65 శాతం మంది పార్ట్‌టైమ్ అవకాశాలలో నిమగ్నమైఉన్నారని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీ సర్వేలో వెల్లడైన సంగతి తెలిసిందే. ఫుడ్ అగ్రిగేటర్ స్విగ్గీ ఆగస్టు ప్రారంభంలో ఉద్యోగులకు పార్ట్‌టైం వర్క్ చేసుకునే అవకాశాన్ని ప్రకటించడంతో మూన్‌లైటింగ్ అనేది చర్చనీయాంశమైంది. మరోవైపు, ఉద్యోగులు పని చేయకుండా బయట ఏం చేస్తున్నారో చూసేంత శక్తి, సామర్థ్యం మేనేజ్మెంట్కు ఉందా అని మార్కెట్ నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. -
చందమ్మమ్మ
మాకు దూరమై అప్పుడే ఏడాది అయిపొయింది. ఇవాళ ఎందుకో పదే పదే అమ్మమ్మ జ్ఞాపకాలు చుట్టుముడుతున్నయి. తెలియకుండానే కళ్ళనుండి జారిపోతున్న కన్నీళ్లు అమ్మమ్మను మరింత గుర్తుచేస్తున్నాయ్. గోడ గడియారం వైపు చుస్తే రాత్రి పావు తక్కువ రెండు అవుతుంది. దిగులుగా నిట్టూర్చి, ఎంతకీ నిద్ర పట్టని ఈ రాత్రి త్వరగా తెల్లారిపొతే బాగుండునని అనుకుంటూ ...మంచంపై నుండీ లేచి వెళ్లి బాల్కనీలో ఊయలలో కూర్చున్నా!పౌర్ణమిరోజు కావడంతో వెన్నెల వెదజల్లుతోంది.చల్లని వెన్నెలలో స్నానం చేసినట్లు మనసుకు ఒక్కసారిగా హాయిగా అనిపించిది. బాల్కనీలో గోడవారగా అమర్చిన కుండీలో నాకిష్టమైన విరజాజి తీగ ‘ఆకుపచ్చని ఆకాశంలా’ నిండుగా కనిపించింది. తీగల చివర మెరిసే నక్షత్రాల్లా అక్కడక్కడా తెల్లని జాజి పూలు. మరో పక్క గుత్తులు గుత్తులుగా విరబూసిన రాధాష్ణ పూలతీగ, తమ కమ్మటి సువాసనలతో నా మనోవేదన కాస్తయినా తగ్గించాలని ఆరాట పడుతున్నట్లున్నాయి పిచ్చివి.చిన్నప్పటి నుండీ వెన్నెలన్నా, వర్షంమన్నా, పువ్వులు, పక్షులూ సూర్యోదయాలూ, సూర్యాస్తమయాలూ అన్నీ నాకు ఆత్మీయ నేస్తాల్లా కనిపిస్తాయి. అలా తదేకంగా....తన్మయత్వంగా, చందమామనే చుస్తూ కూర్చున్న నాకు, చందమామ నాకుదగ్గరగా వస్తున్నట్లు అనిపించిది. నమ్మలేనట్లు చూశాను. ఆశ్చర్యం! చందమామలో ‘అమ్మమ్మ’ ముఖం!ఆనందంతో మనసు కేరింతలు కొట్టింది. పసిపాపలా గెంతులు వేసింది. అచ్చం అదే ముఖం. వాడిపోయి ముడుతలు పడ్డ శరీరం, వంగిపోయిన నడుము, బో....సి చెవులు?? బోసి మెడ, చేతులూ...?? ఆశ్చర్యంతో రెట్టించిన ఆనందంతో చందమామను తడుముతూ అడిగాను, ‘‘అమ్మమ్మ ! నువ్ ఇప్పుడు చందమ్మమ్మవా.?... నువ్వేనా అస్సలు?? నమ్మలేకుండా ఉన్నానే’ని అడిగా సంబరంగా. చందమ్మమ్మ చల్లగా నవ్వింది. అటూ ఇటూ ఊగుతూ......‘‘అవును బిడ్డా! మీ అమ్మమ్మనేరా’’ అంది ప్రేమగా. చల్లగాలికి ఎగిరే నా ముంగురులు అమ్మమ్మ సవరిస్తూన్నదేమో అన్న భావన కలిగి అప్రయత్నంగా క్షణకాలం కళ్ళు మూసుకుని తెరిచా.అమ్మమ్మా! నిన్ను తలచుకుంటే వెంటనే నాకు గుర్తొచ్చేది నీ సాగిపోయిన చెవులకు ఉన్న నీ పెద్ద పేద్ద గంటీలే...నీ మెడలో మెరిసే బంగారు గుండ్లూ..చేతులకి వెండి కడియాలు...ఏమైనయే అవి? చిన్నప్పటి నుండీ ఎప్పుడూ నిన్నిట్ల బోసిగా చూడలేదే నేనూ’’ అంటుంటే... పక పకా నవ్వి అమ్మమ్మ ఇలా అంది... ‘‘పిచ్చి పిల్లా! అసలు మనిషి బతికి ఉంటేనే వాటి కోసంఆశగా చూస్తుంటరు. సచ్చినంక వదుల్తార్ర.?’’ అంటూ మళ్ళి నవ్వింది. నవ్వులో కూడా అమ్మమ్మ కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర... ‘‘అది సరేగని బిడ్డా ఏందిరా? ఇవాళ పొద్దుగాళ్ సంధీ నన్నే యాద్జేస్తన్నవ్? అంత మంచిదే గదా బిడ్డా?’’ పిల్లలు గిట్ల మంచిగున్నార్ర?‘ అంటూ చందమ్మమ్మ ప్రేమగా అడిగే సరికి నాకు కన్నీళ్ళు ఆగలేదు.‘‘హా! అందరూ బాగున్నారు.. చందమ్మమ్మా! ఇవాళ నువ్ చాల గుర్తోచ్చావు తెల్సా’’ అన్నాను ఏడుస్తూ.‘‘తెల్సు బిడ్డా! నీ మనసు నాకు తెల్వదా... అందుకే సముదాయిద్దం అని గిటొచ్చిన. ఊకె గిట్ల బాధపడతరా ఎవ్వళ్ళన్న?’’ మందలింపుతో కూడిన ప్రేమకి కదిలిపోయాను. ‘‘అదికాదు అమ్మమ్మా! నువు ఎప్పుడూ అనేదానివి గుర్తుందా! ‘ఇంత దూరంల ఉన్నవ్! నా సావుదలకైనా అందుతవో, లేదో’ అని. నువు అన్నట్లే అయింది కదానే. నిన్ను కడసారి చూడలేకపోయిన అని, ఇప్పటికీ ఎంత విల విల లాడిపోతున్ననో తెల్సా?’’ అంటూ మళ్ళి ఏడ్చాను.‘‘ఊకో బిడ్డా ఏడ్వకు‘అంటూ.....‘నిన్ను ఊకుండ బెట్టి పొదామనే నీ కండ్లకనవడ్డా...నీకు నేనంటే పాణం కాదా ర! అందుకే నన్ను నువు అట్లా ‘పాణం లేకుండా‘ చూడక పోవుటే నయమనిపిస్తది నాకైతే’’ అంది నన్ను బుజ్జగిస్టూ. ‘‘అయినా అమ్మమ్మా నీకు ఎప్పుడూ తొందరనేనే..యముడితో కూడా గొడవేనాయే నీకు? రమ్మంటే పదమన్నట్లు అలా వెళ్లిపోయావు? నువ్ ఉంటే బాగుండు అమ్మమ్మా’’....బెంగగా అంటున్న నా ముఖాన్ని ఒక్కసారిగా చల్లగా వెన్నెల తాకి వెలిగింది...అమ్మమ్మ నన్ను ముద్దు పెట్టుకున్నదని ఊహించుకుని మురిసిపోయాను! కాసేపాగి అంది ‘‘పిచ్చి దానా! పండుటాకు రాలాలే.. కొత్త శిగురుపుట్టాలె....ఎక్కువ ఆశపడుడు కూడా బాధగాదే బిడ్డా! నువ్వే గిట్ల నళిబిళి అయితే ఎట్లచెప్పూ’’ అంది.‘అమ్మమ్మా! నేను నీ గురించి ఏవో రాయాలని..నీకు ఎన్నో చెప్పాలని అనుకున్ననే! కానీ నా ఆశ ఏదీ తీరలేదు’’ అంటుంటే అడ్డు తగిలి...‘‘ఎండ్ల రస్తవ్ బిడ్డా! పుస్తకంల రస్తవా? నా గురించి?? గొప్పోళ్ళ శరిత్రలే ఇయల్రేపూ సదవట్లేగదరా! నా గురించి రాస్తే సదువుతారే?’’ అంది.‘‘ఎవ్వరి కోసమో కాదే, నాకోసం రాసుకుంట... అచ్చంగా నా కోసం మాత్రమే రాసుకుంటా. నా పిల్లలకు కమ్మని కథలుగా చెప్పుకుంటా! అబ్బా చెప్పవానే ప్లీజ్ ప్లీజ్’’ అని అడిగా గారంగా.నవ్వుతూ...‘‘సరే ఎం శేప్పాలే చెప్పు.. ఐన నీకు తెలవందేముంది రా!’’ అంది ప్రేమగా.‘‘అమ్మమ్మా! నువ్వూ తాత రెక్కల కష్టంతో ఒక ఇంటికి తోడు మూడిల్లు కట్టినరు. తాత పోయిన తర్వాత ఆ ఇళ్ళను పంచిపెడ్తివి, చివరికి ‘జామచెట్టు’ కింద గుడిసెలో ఉంటివీ. అసలది గుడిసె అనడానికి కూడా కాదు. కంది కట్టే అడ్డుపెట్టి, పైన రేకుల కప్పు. మేం ఎమన్నా చేద్దాం అన్నా వద్దని మొండిగా అనే దానివి. చూసేటోల్లు నువ్వు మాకేదో ఇచ్చినవ్ అనుకుంటరు అనేదానివి. ఎండకు ఎండినవ్, వానకు తడిచినవ్. మాపటికి తిందామని దాచిన అన్నం, కుక్క తింటే కుక్కను కూడా తిట్టక నీళ్ళు తాగి పన్నవ్. నీకు ఎవ్వరిపై కోపం లేదా అమ్మమ్మా? అసలు రాదా చెప్పు?? పైగా నువ్వు ఆ గుడిసె ముందు కాలీ జాగాలో నాటే తోటకూర, దొడ్దు చిక్కుడూ...దొండ తీగా, కనకంబరాలూ...బొడ్డు మల్లె ఎంత బాగుండే....బాయి పక్కన నాటిన దానిమ్మ అచ్చం నీ ప్రేమ లెక్కనే మస్తు తీయగ ఉంటుండే. మేం కూడా ఆ జానెడు గుడిసెలో నీతోనే కలిసి ఉండడానికి ఇష్టపడితే నువ్ ‘ఏముందని వొస్తరే నా తాన’ అంటూ ఏడ్చే దానవూ. మేం నీకోసం తెచ్చిన ఐదురూపాయల తమలపాకుల కట్టను కూడా అపురూపంగా చూసే దానివి. అడిగినోళ్లకీ, అడగనోళ్లకీ అందరికీ మా ఎంకటి బిడ్డలు వచ్చిండ్రు అని చెప్పుకుని మురిసి పోయేదానవు. ఎంత హడావుడి చేసే దానవూ? ఉట్టిపైన ఉన్న చిన్న ముంతలో నెయ్యి తీసి గరంపెట్టి, ఇంత చింతతొక్కు తీసి కరివేపాకు, ఎండు మిర్చేసీ పొనికేసి, కట్టెల పొయ్యిపై ఉడుకు ఉడుకుగా అన్నం వండి పెట్టడాన్ని ఎంత సంబరంగా చూసేదాన్నో... నీ గుడిసెని మట్టి,పేడతో కలిపి అలికి ఎప్పుడూ ఎంత మంచిగ ఉంచేదానివి. ఆ చిన్న జాగాలో ఒక పక్కగా నీ మంచం. ఆ మంచానికి నువ్ స్వయంగా చేత్తో కుట్టిన మచ్చర్ధాన్, పైన చిన్న ఫ్యాను. ఓమూలన వరుసగా పేర్చిన నీ కష్టాలు దాచుకున్న సందుగలూ....గోడకు చెక్కపై పేర్చిన (నిన్ను కన్నెత్తి చూడని )నీ దేవుళ్ల పటాలు, దుమ్ము పేరుకొని ఉండేవి... అచ్చము మన బతుకుల్లాగే! కింద పడుకుంటే మాకు నేలపై గతుకుల గచ్చులోనుండీ పైకితేలిన రాళ్ళు గుచ్చుకుంటాయని ఎంతో బాధపడేదానివి. ముందుగాల సిమెంట్ పట్టాలతో కుట్టిన చాపలాంటిది పరిచి, తర్వాత మాకోసం ఉతికి సందుగలో దాచిన మెత్తని బొంత తీసుకువచ్చేదానివి. అది గమ్మత్తైన లైఫ్ బాయ్ సబ్బు వాసన వచ్చేది. ఇప్పటికి నాకు లైఫ్ బాయ్ సబ్బు చుస్తే నువ్వె గుర్తోస్తవ్ తెలుసా! నేల మీద బొంతతో పాటు నీ ప్రేమను కూడా పరుస్తావేమో...కదానే అమ్మమ్మా! పడుకోగానే నిద్ర పడ్తది. నీ ఆరాటం లో ఎంత ప్రేమ, గుడిసెలో ఉండడం, మేడలో ఉండడం అనే మాట అటుంచి మాకు నీతో ఉండడమే ఇష్టమే! కానీ...నీకు అలా ఉండాల్సివచ్చినందుకు ఎప్పుడూ బాధ వేయలేదా?? పైగా నా గుడిసే అని గర్వంగా చెప్పు కుంటావు? కాసేపు మౌనం తర్వాత అమ్మమ్మ మాట్లాడం మొదలు పెట్టింది ...‘గంతే కదానే బిడ్డా! మనకు లేదే అనుకుంటేనే అసలు రంథి...! మనకు ఉన్నది గిదే అనుకుంటే మనసుకు జర కుదార్థమైతది. ఆ గుడిసెలో ఒక దినమా, రెండు దినాలా ? పద్దెనిమిది ఏండ్లు ఉన్నకదానే....ముందు గా గుడిసె కూడా నాకు ఉండెనా??....మసీదులోనే ఒక మూలుంటననీ..ఆడనే ఇంత ఉడక బెట్టుకుంటనని చారెడు బియ్యం గింజలు,వొక గిన్నె చేతిలో పట్టుకు పోతుంటే గా గౌండ్లాయన, గదేనే .. మన ధమ్మంజయ్య పెద్ధబాపు లేదా గాయన తమ్ముడు గొల్లోల వాడకట్టుల వుంటడు ఆయన ఎదురోచ్చిండు....‘అమృతక్కా! ఏడికి పోతన్నవే...నీకీ గోస ఏందే...ఎం కర్మపాడైందే? మేంమంత లేమాయే నీకు? మాఇంట్ల ఉండని’ కొడుకు వాళ్ల ఇంటికి కొంచవోయిందు బిడ్డ.ఆడ వాళ్ళింట్లనే ఒక అరల ఎనిమిది నెలలున్న. గాడ ఇంత ముద్ద ఉంటే తిన్నా! లేదంటే కాళ్ళు కడుపుల పెట్టుకుని మళ్సూకొని పన్నా. గుప్పుడే మీ బాపు వచ్చిండు నా తానకి ‘అత్తమ్మా మాతో ఉండరాదే? ఇట్లా ఎన్నాళ్ళు ఉంటావ్?’ అని అన్నడు. నేను రాను అయ్యా ..నా బిడ్డను కూడా ్చలకు. నేనె ఒకరి ఇంట్ల ఉన్నా అని చెప్పి మర్లగొట్టినా. బిడ్డలు వచ్చేందుకు కూడా నోచని తల్లిని అంటూ గుప్పుడు మాత్రం మస్తు ఏడుసుకొన్నా బిడ్డా! నా గోస పగోనికి కూడా రావద్దు. అట్ల ఉన్నా తొంగిచూసినోడు లేడు నన్ను...చివరికి గా అన్నల్లోకి కల్సిన కిష్ఠప్ప చేయబట్టి నాకు ఆ గుడిసైనా తయారైంది...మేడల్లో ఉన్నా గదే..! గుడిసెలో ఉన్నా గదే!...బతికి ఉండగానే నడిచే శవం లెక్క తిరిగినా..! గివాళ నేను పైకి వచ్చినట్టే గా మేడలో ఉండే వాళ్లు అస్తరా ?రారా? చెప్పు ?’ అంది ఉబికే కన్నీరు ఆపుకుంటూ....తిరిగి తేరుకుని....‘‘నీకు ఇంకొ గమ్మత్తు ముచ్చట చెప్పన్నా! ఇంకానయం ఇక్కడకు నేనే ముందు అచ్చిన.....‘వాళ్లు’ గిట్ల ఇక్కడకు ముందు అచ్చుంటే నాకు ఈడ సూత జాగా లేకుండా చేశురో ఏమో గదానే’’....అంటూ అమృతం కురిసినట్లు ఒకటే నవ్వు......నిజంగా నీకు బాధ లేదా అమ్మమ్మా ? కానీ అమ్మమ్మా ! నేను చూడంగ సచ్చిన కొన్ని గంటలకే పాడె కట్టి, పండగ చేయుడు చూడలేదు..కనీసం నేను వచ్చే వరకు ఉంచమని ఆ ‘పెద్ద మనుషులని’ బతిమాలినా కూడా ఉంచలేదు నిన్ను..కన్నీరు కట్టలు తెగిన ప్రవాహం అయింది. చల్లని గాలి నా బుగ్గలు తడిమింది... అమ్మమ్మ చెయ్యి కాబోలు అనుకున్నా....! చందమ్మమ్మ ఒక క్షణం గంభీరమై మరుక్షణం ఇలా అంది....‘‘కడుపారా కనుకున్న తల్లిని కదానే బిడ్డా! శపించడం తెలవది నాకు. కానీ ...ఏనాడైనా ‘గట్ల జుశుండెడిది కాదు మా అవ్వని’ అనుకోక పోతారు?...ఆల్లకు పైసల్ ఉండొచ్చు రా...పైసల్ ఎం చేస్తాయ్! మా అంటేపాణాల్దీస్తయ్..గంతే! ‘రేపుగిట్ల వాళ్లు ఇక్కడికిసూత నాతానకి వచ్చినా, ఈడ సుత ఇంత జాగా ఇస్తనే నేనూ’’ అంది గర్వంగా!!.మరి ఇంకేం ‘అక్కడ’ కూడా ఓ ‘జామ చెట్టు’ నాటు మరి...ఎందుకైనా మంచిది ముందు ముందు పనికొస్తది.....అంటూ అల్లరిగా నవ్వాను, తేలిక పడ్డ మనసుతో..!అందంగా నవ్వి నుదుట ముద్దు పెట్టింది అమ్మమ్మ.....‘‘మరి నే బోవన్నా ఇగ’’ అంది చందమ్మమ్మ...‘‘నీ పేరుకు తగ్గ అమృతమ్మవేనే నువ్వు...ఇపుడు మాత్రం నాకోసం వచ్చిన చల్లని వెన్నెలవు’’ అంటూ గాల్లో ముద్దులు ఇచ్చాను.... చల్లని వెన్నెల్లో నిలువెల్లా తడిచిపోతూ. ∙శారదాదేవి -
ఆస్కార్ ఉత్తమ చిత్రంగా మూన్లైట్
జాతీయం దేశంలోనే అతిపెద్ద శివుడి విగ్రహం ఆవిష్కరణ దేశంలోనే అతిపెద్ద శివుడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ తమిళనాడులోని కోయంబత్తూరులో ఆవిష్కరించారు. 112 అడుగుల ఎల్తైన ఆది యోగి విగ్రహాన్ని ఈశా ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్, తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావు, ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి తదితరులు పాల్గొన్నారు. భారత్, రువాండాల మధ్య 3 ఒప్పందాలు భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ రువాండా పర్యటన సందర్భంగా రెండు దేశాలు ఫిబ్రవరి 20న మూడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇందులో ఇరు దేశాల మధ్య నేరుగా విమానాలు నడిపేందుకు ఉద్దేశించిన వాయు సేవల ఒప్పందం, రువాండాలో ఎంటర్ప్రెన్యూరియల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు, దౌత్యవేత్తలు, అధికారిక పాస్‌పోర్ట్ కలిగిన వారికి వీసా మినహాయింపు ఒప్పందాలు ఉన్నాయి. తీర నిఘా ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తీర ప్రాంతాలపై నిఘా పెంచడమే లక్ష్యంగా ప్రతిపాదించిన ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ నేతృత్వంలోని రక్షణ పరికరాల కొనుగోలు మండలి (డీఏసీ) ఫిబ్రవరి 21న అంగీకారం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.800 కోట్లను వెచ్చించనున్నారు. ఇందులో భాగంగా తీర ప్రాంతాల్లో 38 రాడార్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. జాతీయ పార్కుల్లో బీబీసీ ఎంట్రీపై నిషేధం భారతదేశంలోని జాతీయ పార్కుల్లోకి బీబీసీ, అందులో పనిచేసే జర్నలిస్ట్ జస్టిన్ రౌలత ప్రవేశంపై ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ ఫిబ్రవరి 27న జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్సీటీఏ) నిర్ణయం తీసుకుంది. అసోంలోని ప్రఖ్యాత కజిరంగా నేషనల్ పార్క్‌లో భారత్ చేపడుతున్న జంతువుల రక్షణ చర్యలను ప్రశ్నిస్తూ బీబీసీ తీసిన డాక్యుమెంటరీ అత్యంత దారుణంగా ఉండటంతో ఎన్సీటీఏ ఈ చర్యలు తీసుకుంది. అంతర్జాతీయం అమల్లోకి డబ్ల్యూటీఓ వాణిజ్య సదుపాయాల ఒప్పందం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)కు చెందిన వాణిజ్య సదుపాయాల ఒప్పందం (ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్) ఫిబ్రవరి 22 నుంచి అమల్లోకి వచ్చింది. కస్టమ్స్ నిబంధనల సరళీకరణ తదితర అంశాలకు ఉద్దేశించిన ఈ ఒప్పందాన్ని భారత్‌తో సహా డబ్ల్యూటీఓలోని రెండింట మూడొంతుల సభ్య దేశాలు ఆమోదించాయి. ఈ ఒప్పందం కారణంగా ప్రపంచ వాణిజ్యం ఏటా ట్రిలియన్ డాలర్ల మేర పెరిగే అవకాశం ఉంది. పీహెచ్‌డీలు అత్యధికంగా పొందుతుంది యూఎస్‌లోనే పరిశోధన రంగంలో అత్యధిక పీహెచ్‌డీలు సాధిస్తున్న దేశాలకు సంబంధించి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) ఫిబ్రవరి 27న విడుదల చేసిన నివేదిక ప్రకారం అమెరికాలో అత్యధికంగా డాక్టరేట్ డిగ్రీలు పొందుతున్నారు. ఉన్నత విద్యపై కమిటీ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నలాజికల్ పాలసీ– 2016, సెప్టెంబర్‌లో రూపొందించిన నివేదికను ఓఈసీడీ ఆమోదించింది. ఆర్థిక సహకారం, అభివృద్ధి సంఘంగా పిలిచే ఓఈసీడీలో 35 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇజ్రాయెల్‌తో భారీ క్షిపణి ఒప్పందం ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను చేధించే మధ్యంతర శ్రేణి క్షిపణి (ఎంఆర్–శామ్)ని ఇజ్రాయెల్‌తో కలిసి అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన భారీ ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 22న ఆమోదం తెలిపింది. రూ.17,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ); ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ)లు సంయుక్తంగా అమలుచేస్తాయి. ఈ ఒప్పందం ప్రకారం భారత సైన్యానికి క్షిపణులు సరఫరా చేస్తారు. ఈ క్షిపణి నౌకాదళం కోసం రూపొందిస్తున్న దీర్ఘశ్రేణి ఎల్ఆర్–శామ్కు భూతల వెర్షన్. దీని పరిధి దాదాపు 70 కిలోమీటర్లు. ఏడు గ్రహాల సౌర కుటుంబాన్ని గుర్తించిన నాసా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) శాస్త్రవేత్తలు మరో సౌర కుటుంబాన్ని గుర్తించారు. ఇందులో ఏడు గ్రహాలు కొంచెం అటు ఇటుగా భూమి సైజులోనే ఉన్నాయని నాసా ఫిబ్రవరి 21న తెలిపింది. వీటిలో కనీసం 6 గ్రహాలపై భూమిపై ఉన్నట్లే రాళ్లు, రప్పలు ఉన్నాయి. మొత్తం 7 గ్రహాల్లో మూడు గోల్డిలాక్ జోన్లో ఉన్నాయి. అంటే ఈ మూడు గ్రహాలు సూర్యుడి నుంచి మరీ దూరంగా కాకుండా (చల్లగా ఉండకుండా) మరీ దగ్గరగా లేకుండా (ఎండ వేడికి కరిగిపోకుండా) ఉన్నాయి. దీంతో ఈ మూడు గ్రహాలపై భారీ మహా సముద్రాలు ఉండే అవకాశం ఉంది. ఆర్థికం దేశంలోనే ధనిక నగరంగా ముంబై దేశ ఆర్థిక రాజధాని ముంబై దేశంలోనే ధనిక నగరంగా నిలిచింది. 46,000 మంది మిలియనీర్లు, 28 మంది బిలియనీర్లకు ముంబై నివాస స్థలంగా ఉంది. ముంబైలో మొత్తం సంపద 820 బిలియన్ డాలర్లుగా ఉందని న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక తెలిపింది. సంపద పరంగా ముంబై తర్వాత స్థానాల్లో వరుసగా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. ఢిల్లీలో 23,000 మంది మిలియనీర్లు, 18 మంది బిలియనీర్లు ఉన్నారు. మొత్తం సంపద 450 బిలియన్ డాలర్లు. బెంగళూరులో 7,700 మంది మిలియనీర్లు, 8 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరి మొత్తం సంపద 320 బిలియన్ డాలర్లు. నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్‌లో 9,000 మంది మిలియనీర్లు, ఆరుగురు బిలియనీర్లు ఉన్నారు. వీరి సంపద 310 బిలియన్ డాలర్లు. దేశంలో మొత్తం సంపద 6.2 లక్షల కోట్ల డాలర్లు కాగా, 2,64,000 మంది మిలియనీర్లు, 95 మంది బిలియనీర్లు ఉన్నారు. వార్తల్లో వ్యక్తులు ఆర్థికవేత్త కెన్నెత్ కన్నుమూత ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత కెన్నెత్ జె.ఆరో (95) అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఫిబ్రవరి 21న మరణించారు. ఆయనకు సాధారణ సమతౌల్య సిద్ధాంతంలో గణిత నమూనాలపై చేసిన కృషికి 1972లో నోబెల్ బహుమతి దక్కింది. అజర్బైజాన్ ఉపాధ్యక్షురాలిగా అధ్యక్షుడి భార్య అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హమ్ అలియెవ్ తన భార్య మెహ్రిబన్‌ను ఆ దేశానికి మొట్టమొదటి ఉపాధ్యక్షురాలిగా నియమించారు. దీని కోసం 2016, సెప్టెంబర్‌లో రిఫరెండం నిర్వహించారు. అవార్డులు ఆస్కార్ ఉత్తమ చిత్రంగా మూన్లైట్ చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకమైన 89వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఫిబ్రవరి 27న లాస్ఏంజెల్స్లో జరిగింది. అవార్డులు–విజేతలు ఉత్తమ చిత్రం: మూన్లైట్ ఉత్తమ నటుడు: కేసీ ఆఫ్లెక్ (మాంచెస్టర్ బై ద సీ) ఉత్తమ నటి: ఎమ్మాస్టోన్ (లా లా లాండ్) ఉత్తమ దర్శకుడు: డామీన చాజెల్లె (లా లా లాండ్) ఉత్తమ సహాయ నటుడు: మహేర్షాల అలీ (మూన్లైట్), ఆస్కార్ పొందిన తొలి ముస్లిం. ఉత్తమ విదేశీ భాష చిత్రం: ది సేల్స్‌మ్యాన్ (ఇరాన్) ఉత్తమ సహాయ నటి: వయోలా డేవిస్ (ఫెన్సెస్) ఉత్తమ డాక్యుమెంటరీ: .జే.. మేడ్ ఇన్ అమెరికా స్ట్ సినిమాటోగ్రఫీ: లా లా లాండ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్: లా లా లాండ్ టంకశాల అశోక్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రముఖ పాత్రికేయుడు టంకశాల అశోక్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ఆంగ్లంలో రాజ్‌మోహన్‌గాంధీ రచించిన పటేల్: ఏ లైఫ్ (బయోగ్రఫీ) పుస్తకాన్ని టంకశాల అశోక్.. వల్లభాయ్‌పటేల్ పేరుతో తెలుగులోకి అనువదించారు. దీన్ని 2016లో తెలుగులో ఉత్తమ అనువాద పుస్తకంగా అకాడమీ ప్రకటించింది. సంస్కృత అనువాదంలో రాణి సదాశివమూర్తికి పురస్కారం: రాష్ట్రీయ సంస్కృత విద్యాపీuŠ‡ ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తెలుగులో రాళ్లబండి కవితాప్రసాద్ రచించిన ‘ఒంటరి పూలబుట్ట (కవితలు)’ ను సదాశివమూర్తి ‘వివక్త పుష్పకరంద’ పేరుతో సంస్కృతంలోకి అనువదించారు. దీన్ని 2016లో సంస్కృతంలో ఉత్తమ అనువాద పుస్తకంగా అకాడమీ ప్రకటించింది. రాష్ట్రీయం రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ ప్రారంభం హైదరాబాద్‌లోని పరిశోధనశాలలు, అత్యున్నత విద్యా సంస్థలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఒక దగ్గరకు చేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్)ను ఫిబ్రవరి 24న ఏర్పాటు చేసింది. శాస్త్ర పరిశోధనలకు విలువలు జోడించడం, వాటిని ఉత్పత్తులు, సేవలుగా మార్చడంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడంతోపాటు వ్యాపార స్థాయికి అభివృద్ధి చేయడమే రిచ్ ప్రధాన లక్ష్యాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. మేధోసంపత్తి, వాణిజ్య చట్టాలపై అంతర్జాతీయ సదస్సు ‘మేధోసంపత్తి, వాణిజ్య న్యాయాలకు అనుగుణంగా చట్టాలు’ అనే అంశంపై విజయవాడలో ఫిబ్రవరి 24, 25 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సును బెజవాడ బార్ అసోసియేషన్, ఏపీ ఆర్థికాభివృద్ధి బోర్డు, జపాన్‌కు చెందిన జపాన్ విదేశీ వాణిజ్య సంస్థ (జెట్రో) నిర్వహించాయి. సైబర్‌క్రైమ్ నివారణకు ఐటీ చట్టాలను మరింత పటిష్టం చేయాల్సి ఉందని సదస్సులో పాల్గొన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. క్రీడలు భారత మహిళల టీమ్‌కు ప్రపంచకప్ అర్హత టోర్నీ టైటిల్ ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ టోర్నీ ఫైనల్లో భారత్ విజేతగా నిలిచింది. కొలంబోలో ఫిబ్రవరి 21న జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించింది. మొత్తం పది జట్లు పాల్గొన్నSఈ టోర్నీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్‌లు జూన్‌లో ఇంగ్లండ్‌లో జరగనున్న ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. హెచ్ఐఎల్ టైటిల్ గెలుచుకున్న కళింగ లాన్సర్స్ కళింగ లాన్సర్స్ జట్టు హాకీ ఇండియా లీగ్–2017 టైటిల్ గెలుచుకుంది. ఛండీగఢ్‌లో ఫిబ్రవరి 26న జరిగిన ఫైనల్లో దబాంగ్ ముంబైపై విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ జట్టు మూడో స్థానంలో నిలిచింది. చెస్ ప్రపంచకప్‌లో హారికకు కాంస్యం ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రపంచ మహిళల నాకౌట్ చెస్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. ఇరాన్‌లోని టెహ్రాన్‌లో ఫిబ్రవరి 25న జరిగిన సెమీఫైనల్లో తాన్ జోంగి (చైనా) చేతిలో హారిక ఓడిపోయింది. దీంతో వరుసగా మూడోసారి కాంస్యంతో సరిపెట్టుకుంది. -
ఆస్కార్‌కూ ‘ట్రంప్’ మంటలు!
- ముస్లిం దేశాలపై నిషేధానికి నిరసనగా వేడుకలకు రాని ఇరాన్ డైరెక్టర్ అస్ఘర్ ఫర్హాదీ - ట్రంప్ విధానాలపై మండిపాటు - ఆరు ఆస్కార్లు గెల్చుకున్న ‘లా లా ల్యాండ్’ - ఉత్తమ చిత్రంగా మూన్లైట్ ‘ట్రంప్’మంటలు ఆస్కార్ అవార్డులకూ పాకాయి! ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు విధించిన నిషేధాన్ని నిరసిస్తూ ఇరాన్‌కు చెందిన చిత్ర దర్శకుడు అస్ఘర్ ఫర్హాదీ... అవార్డు కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఉత్తమ విదేశీ విభాగంలో ‘ది సేల్స్‌మేన్’ ఆస్కార్‌ను గెల్చుకోగా.. అవార్డును అందుకునేందుకు ఆయన రావాల్సి ఉంది. అయితే ట్రంప్ విధానాలపై మండిపడుతూ ఈ కార్యక్రమానికి ఫర్హాదీ దూరంగా ఉండిపోయారు. ఇదిలా ఉండగా ఈసారి ఉత్తమ చిత్రంగా ‘మూన్లైట్’ఎంపికైంది. ఈ చిత్రం మొత్తం మూడు పురస్కారాలను ఎగరేసుకుపోయింది. 14 కేటగిరీల్లో నామినేట్ అయిన ‘లా లా ల్యాండ్’చిత్రానికి ఆరు అవార్డులు దక్కాయి. ఒక్క అడుగు... భగవంతుణ్ణి అదొక్కటీ అడుగు... లైఫ్‌లో ఒక్కసారైనా ఆస్కార్‌తో అడుగేయాలని అడుగు... చిత్రసీమలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ ఆస్కార్ గెలిచి, అవార్డు వేదికపై ఓ అడుగేయాలనుకుంటారు. కొందరికి ఛాన్స్ త్వరగా వస్తుంది. మరికొందరికి లేటుగా వస్తుంది. అవకాశం ఎప్పుడొచ్చినా ఆస్కార్ అందుకున్న తర్వాత వేసే మొదటి అడుగు లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుంటుంది. ఉత్తమ నటి, నటుడు, దర్శకుడు, సహాయ నటి, సహాయ నటుడు, సంగీత దర్శకుడు... 89వ ఆస్కార్స్‌లో ముఖ్యమైన కేటగిరీల్లో తొలి అవార్డు (ఫస్ట్ స్టెప్) గెల్చుకున్నోళ్లు ఎక్కువమందే ఉన్నారు. ఈ ఫస్ట్ స్టెప్ మరిన్ని సక్సెస్ స్టెప్స్ వేసే జోష్, ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటూ... కంగ్రాచ్యులేషన్స్ టు ఆస్కార్ విన్నర్స్. 2017 ఆస్కార్ విజేతలు వీరే ఉత్తమ చిత్రం: మూన్లైట్; ఉత్తమ నటుడు: కేసీ అఫ్లెక్ (మాంచెస్టర్ బై ద సీ); ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (లా లా ల్యాండ్) ; ఉత్తమ దర్శకుడు: డామీన్ చాజెల్లె (లా లా ల్యాండ్) ; ఉత్తమ సహాయ నటుడు: మహేర్షలా అలీ (మూన్ లైట్) ; ఉత్తమ సహాయ నటి: వయోలా డేవిస్ (ఫెన్సెస్) ; ఉత్తమ మేకప్ మరియు హెయిర్ స్టైల్: సూసైడ్ స్క్వాడ్ చిత్రం ; ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ చిత్రం: ఫెంటాస్టిక్ బీస్టస్ ; ఉత్తమ డాక్యుమెంటరీ: ఓ.జే.. మేడ్ ఇన్ అమెరికా ; ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: అరైవల్ ; ఉత్తమ సౌండ్ ; మిక్సింగ్ చిత్రం: హాక్సారిడ్జ్ ; ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: జాన్ గిల్బర్ట్ ; ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ద సెల్స్మ్యాన్ (ఇరాన్ ) ; బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్: జూటోపియా ; బెస్ట్ యానిమేటెడ్ షార్ట్: పైపర్ ; ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ చిత్రం: లా లా ల్యాండ్ ; బెస్ట్ విజువల్ ఎఫెక్టస్: ద జంగిల్ బుక్ ; బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్: ద వైట్ హెల్మెట్స్ ; బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: సింగ్ ; బెస్ట్ సినిమాటోగ్రఫి: లా లా ల్యాండ్ ; బెస్ట్ ఒరి జినల్ ; స్కోర్: లా లా లాండ్ ; బెస్ట్ ఒరిజినల్ సాంగ్: సిటీ ఆఫ్ స్టార్స్ (లా లా ల్యాండ్) ; బెస్ట్ ఒరిజినల్ స్కీన్ర్‌ప్లే: మాంచెస్టర్ బై ద సీ ; బెస్ట్ అడాప్టెడ్ స్కీన్ర్‌ప్లే: మూన్లైట్ ఆ గీత చెరగాలి – అస్ఘర్ ఫర్హాదీ ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఇరానియన్ మూవీ ‘ది సేల్స్‌మేన్’కు అవార్డు దక్కింది. ఆ చిత్రదర్శకుడు అస్ఘర్ ఫర్హాదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్ల తన ఆగ్రహావేదనను వ్యక్తం చేశారు. ‘‘ముస్లిమ్ దేశాలపై ట్రంప్ విధించిన ‘ట్రావెల్ బ్యాన్’కు నిరసనగా ఈ అవార్డు వేడుకకు హాజరు కాలేదు’’ అని ఆయన పేర్కొన్నారు. తన మనోభావాలను లిఖితపూర్వకంగా ఆస్కార్ అవార్డు కమిటీకి పంపించారు. ‘‘పలు ముస్లిమ్ దేశాల పౌరులపై ట్రంప్ ఆంక్షలు విధించారు. ఆ దేశాలను, అక్కడి ప్రజలను గౌరవిస్తున్నాను. అందుకే అవార్డు తీసుకోవడానికి రాలేదు. ప్రపంచాన్ని మనము, మన శత్రువులు అని విభజించడం భయంగా ఉంది. యుద్ధానికి దారి తీసే ఘోరమైన నిర్ణయాలివి. ఇది సరికాదు. ఫిలిం మేకర్స్ తమ కెమేరాలను ఎక్కుపెట్టి కుల, మతాలనే అడ్డుగోడను చెరిపేయగలరు. ‘మేము, ఇతరులు.. అనే ఆ ఇద్దరి మధ్య సమానత్వాన్ని పెంపొందించగలరు. ఈరోజు ఆ సమానత్వం చాలా అవసరం’’ అంటూ అస్ఘర్ మనోభావాలను హోస్ట్ చదివారు. విన్న వీక్షకులు ఉద్వేగానికి గురయ్యారు. కొందరు చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. నా హార్ట్ ముక్కలైందన్నాడు! – ఉత్తమ నటుడు క్యాసే ఎఫ్లెక్ ఉత్తమ నటుడిగా క్యాసే ఎఫ్లెక్ పేరు ప్రకటించగానే, అతడు సీట్లో నుంచి వెంటనే లేచి తన అన్నయ్య బెన్ ఎఫ్లెక్ వద్దకు వెళ్లి కౌగిలించుకున్నారు. ఆల్రెడీ ఉత్తమ చిత్రం (నిర్మాతగా), బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే (మాట్ డామన్తో కలసి).. రెండు సార్లు్ల బెన్ ఎఫ్లెక్ ఆస్కార్స్ అందుకున్నారు. ఇప్పుడు క్యాసే ఎఫ్లెక్కి అవార్డు రావడంతో ఆస్కార్స్ అందుకున్న సిబ్లింగ్స్ (తోబుట్టువులు) లిస్టులో ఈ అన్నదమ్ములిద్దరూ 16వ స్థానం సంపాదించారు. ఇక, అవార్డు స్వీకరించిన తర్వాత క్యాసే ఎఫ్లెక్ మాట్లాడుతూ – ‘‘నాకు ఎలా నటించాలో నేర్పిన మొదటి వ్యక్తుల్లో దర్శక–నటుడు డెంజెల్ వాషింగ్టన్ ఒకరు. జస్ట్.. ఇప్పుడే ఆయన్ను కలిశాను. థాంక్యూ! ఈ అవార్డు నాకెంతో విలువైనది. ఆస్కార్ కమ్యూనిటీలో భాగం కావడం నా అదృష్టం. ఇంతకు మించి మాటలు రావడం లేదు. ‘మాంచెస్టర్ బై ద సీ’ యూనిట్ సభ్యులకు థ్యాంక్స్. బెన్... ఐ లవ్ యూ’’ అన్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ స్పీచ్‌లో అన్నయ్య బెన్ ఎఫ్లెక్ పేరును క్యాసే ప్రస్తావించలేదు కానీ, మాజీ భార్య గురించి పేర్కొన్నారు. ఈ ఆస్కార్స్ స్పీచ్‌లో పిల్లలతో పాటు మాజీ భార్య పేరు మర్చిపోయారు. ‘‘ఆస్కార్ వేదిక దిగిన మూడు సెకన్లకు నా ఫోన్ మోగింది. ‘మా గురించి చెప్పడం మర్చిపోయావ్. నా హార్ట్ ముక్కలైంది’ అని మా అబ్బాయి అన్నాడు’’ అని బ్యాక్ స్టేజిలో క్యాసే ఎఫ్లెక్ పేర్కొన్నారు. ఆస్కార్ అందుకున్న తొలి ముస్లిం ఇలాంటి పాత్రలకు బానిసను – ఉత్తమ సహాయ నటుడు మహేర్షలా అలీ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును అందుకున్న తొలి ముస్లిమ్ వ్యక్తిగా మహేర్షలా అలీ (43) చరిత్ర సృష్టించారు. ఈ ఏడాది ఆస్కార్ ఉత్తమ చిత్రం ‘మూన్ లైట్’లో ప్రదర్శించిన నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా మహేర్షలా అలీకు ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ చిత్రంలో అలీ డ్రగ్ డీలర్ జువాన్ పాత్రలో ఒదిగిపోయారు. జెఫ్ బ్రిడ్జెస్, హెడ్జెస్, దేవ్ పటేల్, షానూన్ వంటి అగ్రనటులతో పోటీపడి అలీ ఈ అవార్డును కైవసం చేసుకున్నారు. ‘లయన్’ చిత్రంతో సహాయ నటుడి విభాగంలో నిలిచిన భారత సంతతి నటుడు దేవ్ పటేల్‌కు నిరాశే ఎదురైంది. అవార్డు తీసుకున్న తర్వాత మహేర్షలా అలీ ఉద్వేగభరితమైన స్పీచ్ ఇచ్చారు. ‘‘మూన్ లైట్’ వంటి సినిమాల్లోని పాత్రలకు నేను బానిసను. ఈ చిత్రదర్శకుడు బెర్రిజెన్ కిన్స్కు థ్యాంక్స్. నటన నేర్చుకోవడంలో నాకు సహకరించిన టీచర్స్, ప్రొఫెసర్స్ అందరికీ ధన్యవాదాలు. ‘ఏ అవార్డు అయినా మనకు ఇచ్చినది కాదు. చిత్రంలోని పాత్రకు ఇచ్చినది’ అని వాళ్లు అనేవాళ్లు. నా ఫీలింగ్ కూడా అదే. నా భార్య సామి కరీమ్‌కు రుణపడి ఉంటాను’’ అన్నారు. 2013లో సామి కరీమ్‌తో మహేర్షల వివాహం జరిగింది. నాలుగు రోజుల క్రితమే కరీమ్ ఓ పాపకు జన్మనిచ్చారు. ఇప్పుడు భర్త ఆస్కార్ అందుకున్నారు. దీంతో మహేర్షల దంపతులు డబుల్ హ్యాపీ. ఆ సంగతలా ఉంచితే, వాస్తవానికి అలీ క్రిస్టియన్ అనీ, అయితే ఓ సందర్భంలో మసీదుకు వెళ్లి వచ్చిన తరువాత ముస్లిమ్‌గా మారారని సమాచారం. అతను అహ్మదీయుడు అనేది కొందరి వాదన. వాదించుకునేవాళ్లు వాదించుకుంటూనే ఉంటారు. ఇవన్నీ పట్టించుకునే స్థితిలో లేని మహేర్షలనిండు మనసుతో శుభాకాంక్షలు చెబుతున్నవాళ్లకు ధన్యవాదాలు తెలియజేయడంలోనూ, ఇప్పుడే తన జీవితంలోకి వచ్చిన పసి పాపను అపురూపంగా చూసుకోవడంలోనూ బిజీ అయ్యారు. లా లా.. లవ్‌లో పడ్డా – ఉత్తమ దర్శకుడు డామీన్ ఛాజెల్లె ఇప్పటివరకూ ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్స్ అందుకున్న వ్యక్తుల్లో డామీన్ ఛాజెల్లె (‘లా లా ల్యాండ్’ దర్శకుడు) చిన్నోడిగా చరిత్ర సృష్టించారు. అతడి వయసు 32 ఏళ్లు. ఫస్ట్ టైమ్ ఆస్కార్ అందుకున్న డామీన్ మాట్లాడుతూ – ‘‘ప్రేమ గురించి చెప్పిన సినిమా ‘లా లా ల్యాండ్’. ఈ సినిమా తీస్తున్న టైమ్‌లోనే నేను ప్రేమలో పడడం నా అదృష్టం. దీనర్థం... నాతో పాటు నువ్వూ (డామీన్ ప్రేయసి ఒలీవియా హామిల్టన్) ఈ అవార్డును పంచుకున్నట్లే’’ అన్నారు. ఆ శరీరాలను తవ్వి బయటకు తీయాలి! – ఉత్తమ సహాయ నటి వయోలా డేవిస్ ‘‘మీకో విషయం తెలుసా? అత్యంత ప్రతిభావంతులందరూ కలిసుండే చోటు ఒకటుంది. అదే శ్మశానం’’ అంటూ కన్నీటి పర్యంతమవుతూ వయోలా డేవిస్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రచయిత ఆగస్ట్ విల్సన్ రాసిన ‘ఫెన్సెస్’ అనే కథ ఆధారంగా అదే పేరుతో రూపొందిన చిత్రంలో అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు గాను ఆమె ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకున్నారు. 2005లో ఆగస్ట్ విల్సన్ చనిపోయారు. ఆయన రాసిన కథలోని పాత్ర తనకు అవార్డు తెచ్చిపెట్టినందుకుగాను ఆస్కార్ వేదికపై వయోలా ఆయన్ను గుర్తు చేసుకున్నారు. ఇంకా వయోలా మాట్లాడుతూ – ‘‘నువ్వు ఎలాంటి కథలు చెప్పాలనుకుంటావ్? అని కొంతమంది నన్ను అడుగుతుంటారు. ‘తవ్వి, పాతిపెట్టిన ఆ శరీరాలను బయటకు తీయాలి. ఆ మనుషుల కథలను తెలుసుకోవాలి. పెద్ద పెద్ద కలలు కని, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడి, ఫలాలు అందుకోని ఆ వ్యక్తుల కథలు చెప్పాలనిపిస్తుంది’ అంటుంటాను’ అన్నారు. ఆగస్ట్ విల్సన్ వంటి ప్రతిభావంతుల మరణాన్ని ఉద్దేశించే ఆమె ఇంత ఉద్వేగంగా మాట్లాడారు. ‘‘నేను ఆర్టిస్టును అయ్యాను. అందుకు దేవుడికి రుణపడి ఉంటాను. సెలబ్రిటీల హోదాలో బ్రతికేందుకు ఇదొక మంచి ప్రొఫెషన్. ఎలా జీవించాలో, ఎలా ప్రేమించాలో ప్రతి రోజూ.. నాకు నేర్పే నా భర్త , నా కూతురికి రుణపడి ఉంటాను. డైరెక్టర్ డెంజెల్ వాషింగ్టన్కు ధ్యాంక్స్’’ అని వయోలా డేవిస్ అన్నారు. మూడు సార్లు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన, తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న అమెరికన్– అఫ్రికన్ వుమెన్‌గా వయోలా రికార్డ్ సాధించారు. తప్పు తప్పే.. శుద్ధ తప్పే! ఏం జరిగింది? ఓ చిత్రం పేరుకు బదులు మరో చిత్రం పేరును చదివారు. చెప్పుకోవడానికి చిన్న తప్పే! కానీ, ఏదో పొరపాటు జరిగిందని సర్దిచెప్పుకోవడానికి వీలు లేని తప్పు జరిగింది. ఈ తప్పే కాదు.. ఇంకో శుద్ధ తప్పు కూడా జరిగింది. ఈ ఏడాది జరిగిన 89వ ఆస్కార్స్‌లో ‘మూన్లైట్’ ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది. కానీ, ‘మూన్లైట్’ పేరు ప్రకటించిన తీరు మాత్రం సూపర్‌హిట్ సినిమా క్లైమాక్స్‌ను తలపించింది. అసలు ఏం జరిగిందంటే... జోక్ కాదు.. నిజమే! క్లాసిక్ ఫిల్మ్ ‘బోనీ అండ్ క్లయిడే’ విడుదలై 50 ఏళ్లైంది. ఈ సందర్భంగా అందులోని స్టార్స్ వారెన్ బీట్టీ, ఫాయే డన్ అవేలను 89వ ఆస్కార్ అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్రం పేరును ప్రకటించమని వేదికపైకి పంపారు. వాళ్లు ‘లా లా ల్యాండ్’ పేరును ప్రకటించారు. ఒక్కసారిగా హర్షాతిరేకాలు.. కరతాళ ధ్వనులు.. ‘లా లా ల్యాండ్’ చిత్ర బృందం అవార్డును స్వీకరించడానికి వేదికపైకి చేరుకుంది. యాక్సెప్టెన్స్ స్పీచ్‌లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇంతలో, ‘లా లా ల్యాండ్’ చిత్ర నిర్మాతల్లో ఒకరైన జోర్డాన్ హోరోవిట్జ్ మైక్ అందుకుని... ‘‘ఉత్తమ చిత్రం కేటగిరీ విజేత ‘మూన్లైట్’. దిస్ ఈజ్ నాట్ ఎ జోక్’’ అంటూ అవార్డు కార్డును అందరికీ చూపించారు. ఒక్కసారిగా వేదికపై ఉన్న మిగతా చిత్ర బృందంలో ఆనందం ఆవిరైంది. ఆ వెంటనే వారంతా వేదికను ఖాళీ చేశారు. తర్వాత ‘మూన్లైట్’ చిత్ర బృందం అవార్డును అందుకుంది. ‘లా లా ల్యాండ్’ సినిమా క్లైమాక్స్‌లో ఒక్క క్షణం హీరో హీరోయిన్ కలుసుకున్నట్టు చూపిస్తారు. కట్ చేస్తే... హీరోయిన్ మరొకర్ని పెళ్లి చేసుకుంటుంది. థియేటర్లో ప్రేక్షకులు అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి అనుకుంటారు. ఆస్కార్స్ వేదికపై జరిగిన ఘటన చూశాక.. మళ్లీ సేమ్ ఫీలింగ్ కలగక మానదు. (ఆస్కార్-2017: ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) తప్పే.. క్షమించండి! ఆస్కార్స్ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిన ఈ ఘటనపై ప్రైజ్ వాటర్‌హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) క్షమాపణలు కోరింది. 83 ఏళ్లుగా ఆస్కార్స్ బ్యాలెట్ కౌంటింగ్‌ను ఈ సంస్థ పర్యవేక్షిస్తోంది. ‘‘ఉత్తమ చిత్రం పేరును ప్రకటించే సమయంలో జరిగిన తప్పుకి అందరికీ క్షమాపణ చెబుతున్నాం’’ అని పీడబ్ల్యూసీ సంస్థ పేర్కొంది. ప్రెజెంటర్స్కు రాంగ్ కవర్ ఇవ్వడంతో ఈ తప్పు జరిగిందట! ఇంకొకరి బాధలో ఆనందం ఎక్కడుంది? ఆస్కార్స్ వేదికపై జరిగిన ఘటన పట్ల మహేర్షలా అలీ స్పందిస్తూ – ‘‘ఉత్తమ చిత్రంగా ‘లా లా ల్యాండ్’ పేరు ప్రకటించగానే నేనేమీ సర్ప్రైజ్ కాలేదు. ఆ సినిమా బాగుంది, బాగా ఆడింది. వాళ్లు వేదికపై ఉన్నప్పుడు సెక్యూరిటీ, ఇతరులు వచ్చి డిస్ట్రబ్ చేస్తుంటే వర్రీ అయ్యాను. అప్పుడు ‘మూన్లైట్’ పేరు ప్రకటించగానే వేదికపైకి వెళ్లాలనుకోలేదు. అలాంటి సందర్భంలో ఆనందపడడం చాలా కష్టం. కానీ, అదృష్టవశాత్తూ మేము ఉత్తమ చిత్రం పురస్కారంతో బయటకు నడిచాం’’ అన్నారు. ఎమ్మా స్టోన్ (ఉత్తమ నటి, ‘లా లా ల్యాండ్’) మాట్లాడుతూ –‘‘ఓ గాడ్, ఐ లవ్ ‘మూన్లైట్’ సోమచ్. అఫ్కోర్స్, ‘లా లా ల్యాండ్’ పేరు ఉత్తమ చిత్రంగా వినడం అద్భుతంగా ఉంది. ‘మూన్లైట్’ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది’’ అన్నారు. బతికి ఉన్న మనిషిని చంపేశారు! బతికి ఉన్న మనుషులకు నివాళులు అర్పిస్తారా? అలా చేస్తే బతికున్నవాళ్ల ఫీలింగ్ ఏంటి? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ‘జాన్ చాప్మాన్’ని అడిగితే చెబుతారు. ఎవరీ జాన్ చాప్మాన్ అంటే? ఈవిడ ఆస్ట్రేలియన్ ఫిలిం ప్రొడ్యూసర్. ‘ది పియానో’, ‘లవ్ సెరనేడ్’, ‘హోలీ స్మోక్’ వంటి పలు చిత్రాలు నిర్మించారు. వయసు 66. మంచి ఆరోగ్యంతో హాయిగా ఉన్నారు. కానీ, గతేడాది తిరిగి రాని లోకాలకు వెళ్లిన ప్రముఖులకు నివాళులర్పించే కార్యక్రమంలో ఆస్కార్ అవార్డు కమిటీ జాన్ చాప్మాన్ ఫొటోను చూపించింది. గతేడాది చనిపోయిన కాస్ట్యూమ్ డిజైనర్ ‘జానెట్ ప్యాటర్సన్’కి నివాళులర్పిస్తూ, ఆమె ఫొటోకు బదులుగా చాప్మాన్ ఫొటోను చూపించారు. దాంతో ‘నేను బతికే ఉన్నాను. బాగున్నాను కూడా. నిర్మాతగా యాక్టివ్‌గా ఉన్నాను’ అని చాప్మాన్ చెప్పుకోవాల్సి వచ్చింది. జానెట్ ప్యాటర్సన్తో కలసి తాను సినిమాలు చేశానని, ఆమె మంచి స్నేహితురాలని కూడా చాప్మాన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు అనిపించుకున్న ఆస్కార్ అవార్డు లాంటి భారీ వేడుకలో ఇలాంటి తప్పులు జరగడం నిర్వాహకుల నిర్లక్ష్య ధోరణిని బయటపెట్టింది. అదృష్టం.. అవకాశం కలిసొస్తేనే... – ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ ఉత్తమ నటి అవార్డు అందుకున్న ఎమ్మా స్టోన్.. ఆస్కార్స్‌కి నామినేట్ అయిన సహచర నటీమణులపై ప్రశంసల వర్షం కురిపిస్తూ, ఫ్యామిలీకి థ్యాంక్స్ చెబుతూ స్పీచ్ ప్రారంభించారు. ‘‘అదృష్టం, అవకాశం బాగా కలిసొచ్చినప్పుడే ఇలాంటి సందర్భం వస్తుందని నాకు అర్థమైంది. జీవితంలో ఒక్కసారే ‘లా లా ల్యాండ్’ వంటి సినిమాలో నటించే ఛాన్స్ వస్తుంది. నాపై నమ్మకంతో ఈ ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు డామీన్ ఛాజెల్లెకు థ్యాంక్స్. ప్రతిసారీ, ప్రతి సన్నివేశంలో నేను బాగా నటించేలా సహకరించిన ర్యాన్ గోస్లింగ్కి థ్యాంక్స్. నేనింకా నేర్చుకోవలసింది ఎంతో ఉంది’’ అన్నారు. ఓంపురికి ఆస్కార్ నివాళి ప్రతి ఆస్కార్ వేడుకలోనూ గడచిన 12 నెలల్లో స్వర్గస్తులైన సినీ ప్రముఖులకు నివాళులు అర్పించడం అనవాయితీ. అందులో భాగంగా భారతీయ నటుడు ఓంపురికి నివాళులర్పించారు. ‘సిటీ ఆఫ్ జాయ్’, ‘వోల్ఫ్’, ‘ద ఘోస్ట్ అండ్ ద డార్క్నెస్’, ‘సచ్ ఎ లాంగ్ జర్నీ’, ‘ఈస్ట్ ఈజ్ ఈస్ట్’లతో పాటు మరికొన్ని ఇంగ్లీష్ చిత్రాల్లో ఓంపురి నటించారు. ఆయన నటించిన చివరి ఇంగ్లీష్ చిత్రం ‘వైశ్రాయస్ హౌస్’ ఈ నెల 12న బెర్లిన్‌లో విడుదలైంది. మార్చి 3న యూకేలో విడుదల కానుంది. ‘‘25 ఏళ్ల నుంచి వరుసగా హాలీవుడ్, బ్రిటీష్ సినిమాల్లో నటిస్తున్న ఏకైక నటుడు ఓంపురి. ఈరోజు ఆస్కార్స్ ఆయనకు నివాళులు అర్పించింది. ఆస్కార్స్ నివాళులు అందుకున్న తొలి భారతీయ నటుడు ఓంపురీనే. థ్యాంక్యూ అకాడెమీ అవార్డ్స్. థ్యాంక్యూ ఎవ్రీవన్. వుయ్ మిస్ ఓం’’ అని ఓంపురి ఫ్యామిలీ ఓ ప్రకటనలో పేర్కొంది. దేశీ గాళ్స్ హంగామా విదేశీ తారలకు ధీటుగా ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో పాల్గొని, రెడ్ కార్పెట్‌పై నడవడం అంత వీజీ కాదు.. దానికి చాలా ఖలేజా ఉండాలి. మన దేశీ భామ ప్రియాంకా చోప్రా తన దమ్మేంటో గతేడాది ఆస్కార్ అవార్డు వేడుకల్లో పాల్గొన్నప్పుడు నిరూపించుకున్నారు. వైట్ గౌన్, లైట్ మేకప్, డైమండ్ జ్యుయెలరీలో ఆమె మెరిసిపోయారు. ఈసారి కూడా విదేశీయుల దగ్గర మార్కులు కొట్టేశారు. మరో భామ దీపికా పదుకొనే కూడా సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. ‘ఆఫ్టర్ పార్టీ’ (అవార్డు వేడుక ముగిసిన తర్వాత జరిగే పార్టీ)లో దీపికా పదుకొనే పాల్గొన్నారు. నలుపు రంగు గౌనులో ‘వెరీ నైస్’ అనిపించుకున్నారు. మన దేశీ భామలా... మజాకానా! వయ్యారి భామ.. నీ హంస నడక... 16,500 చదరపు అడుగుల ఎర్ర తివాచీ అది. పదహారణాల తెలుగమ్మాయిలు నడిస్తేనేమి... పరాయి దేశపు భామలు నడిస్తేనేమి... చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసినా.. ఇంకా ఏదో ‘మిస్’ అయ్యామని మగ మనసులు బాధపడిపోతాయ్. వచ్చినవాళ్లు వచ్చినట్లు వయ్యారంగా వాక్ చేసుకుంటూ వెళుతుంటే చూసేకొద్దీ చూడబుద్ధేస్తోందంటూ ఆ మనసులు గారాలు పోయాయి. భారీ రెడ్ కార్పెట్ పై భామలు అడుగులో అడుగేస్తూ, ఆకట్టుకున్నారు. ప్రతి ఏడాదీ రెడ్ కార్పెట్ ఈవెంట్ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచినట్లే ఈ ఏడాది కూడా నిలిచింది. చీరకట్టు @ రెడ్ కార్పెట్టు భారతీయ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం చీరకట్టు. ఆ చీరకట్టు 89వ ఆస్కార్ వేడుకల్లో వీక్షకులతో పాటు సినీ ప్రముఖుల కళ్లను కట్టిపడేసింది. ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో నామినేట్ అయిన దేవ్ పటేల్.. తన తల్లి అనితా పటేల్‌తో కలసి ఆస్కార్ వేడుకలకు హాజరయ్యారు. చీరకట్టులో భారతీయ హుందాతనం చూపించిన అనితా పటేల్‌పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ‘‘దేవ్ పటేల్‌కి ఆస్కార్ రాకున్నా.. 26 ఏళ్లకు నామినేషన్ దక్కడం అద్భుతమైన విషయం. ఆ లెక్కన దేవ్ విన్నరే. ఇంత త్వరగా దేవ్‌కి ఆస్కార్ నామినేషన్ వస్తుందని ఊహించలేదు’’ అని అనితా పటేల్ పేర్కొన్నారు. -
ఆస్కార్ వేదికపై యాంకర్ ఇలా చేశారేమిటి?
లాస్ ఏంజిలిస్: ఆస్కార్ అవార్డులను చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకం భావిస్తారు. ఈ అవార్డు అందుకోవాలన్నది కళాకారులందరి కల. ప్రతి ఏటా అమెరికాలోని లాస్ ఏంజిలిస్‌లో జరిగే ఈ అవార్డుల ప్రదానోత్సవ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని చూసేందుకు సినీ ప్రముఖులే గాక కోట్లాది అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. ఈసారి భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఈ అవార్డుల వేడుక ప్రారంభమైంది. కేటగిరిలా వారిగా అవార్డులను ప్రకటిస్తున్నారు. ఉత్తమ చిత్రం కేటగిరి అవార్డును ప్రకటించాలి. ఈ సమయంలో నిర్వాహకులు తప్పులో కాలేశారు. ఉత్తమ చిత్రంగా లా లా ల్యాండ్‌ను ప్రకటించారు. దీంతో ఆ సినిమా బృందం సంబరాలు చేసుకుంది. అయితే వారికి సంతోషం ఎంతోసేపు నిలవలేదు. పొరపాటు తెలుసుకున్న యాంకర్ సవరణ చెబుతూ ఉత్తమ చిత్రంగా మూన్లైట్ను ప్రకటించారు. అంతే లా లా ల్యాండ్ చిత్రం బృందం సంతోషం ఆవిరికాగా.. మూన్లైట్ బృందం సంబరాల్లో మునిగిపోయింది. సాధారణంగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది యాంకర్ ఏమరుపాటుతో తప్పుగా చదవడాన్ని కొందరు సినీ ప్రముఖులు తప్పుపట్టారు. బెస్ట్ మూవీ స్క్రీన్ ప్లే.. ఆస్కార్ 2017కు ఇవ్వాలని నటి శృతి హాసన్ ట్వీట్ చేసింది. -
ఆస్కార్ వేదికపై యాంకర్ ఇలా చేసిందేమిటి?
-
జాబిల్లిని తళతళలాడిద్దామా?
పుర్రెకో బుద్ది, జిహ్వకో రుచి అని ఓ సామెతుంది. ఈ ఐడియా కూడా ఇదే కోవకు చెందుతుందేమో! ఒకవైపు భూమి మండిపోతోంది.. ఇంకోవైపు అవసరాలు పెరిగిపోతున్నాయి.. మరోవైపు నుంచి వాతావరణ మార్పులు భయపెడుతున్నాయి. ఈ విపత్తును తట్టుకునేదెలా అని శాస్త్రవేత్తలు తలలు పట్టుకుని ఉంటే... జాబిల్లిని తళతళలాడించండి. ఈ తలనొప్పులన్నీ తగ్గిపోతాయి అంటోంది... ఫోరియో ఇన్స్టిట్యూట్! అదెలా సాధ్యమనుకుంటూంటే... మన సహజ ఉపగ్రహం అదేనండి చందమామ సూర్యుడి వెలుగుతోనే మనపై వెన్నెల కురిపిస్తోందన్న విషయం మనకు తెలుసు. అయితే చందమామపై ఉన్న పరిస్థితులు కానివ్వండి... రసాయనిక కూర్పు కానివ్వండి.. చాలా తక్కువ వెలుతురు మాత్రమే భూమిపైకి వస్తోంది. శాస్త్రీయ పరిభాషలో దీన్ని అల్బిడో అని పిలుస్తారు. ప్రస్తుతం ఇది కేవలం 0.12 శాతం మాత్రమే ఉంది. ఈ మోతాదును కాస్త పెంచితే ప్రతి రాత్రి వసంత రాత్రి మాదిరిగా పండు వెన్నెలలు కురుస్తాయని.. తద్వారా భూమిపై రాత్రివేళల్లో వీధి దీపాలను కట్టేసుకోవచ్చునని సూచిస్తోంది స్టాక్‌హోం కేంద్రంగా పనిచేస్తున్న ఫోరియో ఇన్స్టిట్యూట్! భూతాపోన్నతిలో దీపాల వాటా 5 శాతం! పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ వాయువుల విచ్చల విడి వాడకం ద్వారా భూమి వేడెక్కుతోందని, ఫలితంగా భవిష్యత్తులో అనేక విపత్తులు రానున్నాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే స్పష్టం చేశారు. భూతాపోన్నతిలో లైటింగ్ వాటా దాదాపు 5 శాతం ఉంటుంది. అత్యాధునిక ఎల్ఈడీ లైట్ల వాడకం, సౌర, పవన విద్యుత్తు వినియోగాల ద్వారా దీన్ని తగ్గించేందుకు ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ఫోరియో ఇన్స్టిట్యూట్ అంచనా ప్రకారం ఇవన్నీ వ్యయ ప్రయాసలతో కూడిన పనులు. వీటికంటే చాలా తక్కువ ఖర్చుతో జాబిల్లినే భూమి మొత్తానికి వీధి దీపంగా వాడుకోవచ్చునని అంటోంది సంస్థ! ఎలా చేస్తారు? చందమామ ఉపరితలం ద్వారా మరింత ఎక్కువ సూర్య కాంతి ప్రతిఫలించేలా చేయాలి. రసాయనాల వాడకం ద్వారా, లేదా అక్కడి అగాధాలను చదును చేయడం ద్వారా దీన్ని సాధ్యం చేయవచ్చునంటోంది ఫోరియో ఇన్స్టిట్యూట్. చందమామ మొత్తాన్ని మార్చేయాల్సిన అవసరం కూడా లేదని, కేవలం చంద్రుడి ఉపరితలంలో 0.1 శాతాన్ని మార్చినా (స్విట్జర్లాండ్ దేశమంత విస్తీర్ణం) వెన్నెల వెలుగుల్లో 80 శాతం మేరకు వృద్ధి కనిపిస్తుందని అంటున్నారు వీరు. జాబిల్లిపై ఉండే వనరులను వాడుకుంటూ... సౌరశక్తి ద్వారా ఈ పనిని సాధించవచ్చు నన్నది ఫోరియో అంచనా. ఒక్కసారి ఈ మార్పు చేస్తే... దీర్ఘకాలం పాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా వెన్నెల వెలుగులు అందుకోవచ్చునని, పర్యావరణానికి కూడా ఎలాంటి హానీ జరగదనీ వాదిస్తోంది ఈ సంస్థ. ఈ దిశగా తాము ఇప్పటికే కొన్ని పరిశోధనలు చేపట్టామని, అయితే పేటెంట్ల సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రస్తుతానికి వీటి వివరాలను బహిర్గతపరచడం లేదని ఫోరియో తెలిపింది. బోలెడు ఆదా... ఒక్కో వీధి దీపం ద్వారా ఏడాదికి 120 కిలోల కార్బన్ డైయాక్సైడ్ వాయువు వెలువడుతుందని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీధి దీపాలు పదుల కోట్ల సంఖ్యలో ఉంటాయి. వీటన్నింటి వాడకం ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్‌డైయాక్సైడ్ మోతాదు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. జాబిల్లి వెలుగును ఎక్కువ చేయగలిగితే వీధిదీపాలతో పనే ఉండకపోవచ్చునని, తద్వారా అంతమేరకు పర్యావరణానికి మేలు జరుగు తుందని ఫోరియో అంటోంది. ఒక్క అమెరికా, యూరప్‌ల లోనే వీధి దీపాలపై పెడుతున్న వేల కోట్ల రూపాయల ఖర్చును అరికట్టవచ్చునని సూచిస్తోంది.