అభిమానులకు పవన్ సందేశం | Pawan Kalyan Message To Fans | Sakshi
Sakshi News home page

అభిమానులకు పవన్ సందేశం

Published Sat, Sep 2 2017 10:00 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

అభిమానులకు పవన్ సందేశం - Sakshi

అభిమానులకు పవన్ సందేశం

ఈ రోజు (సెప్టెంబర్ 2) తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. 'నాపై ఇంతటి ప్రేమ, కరుణ చూపిస్తున్న అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ఈ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. నేను నా పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకోకపోయినా.. మీరంతా చేయటం ఆనందంగా ఉంది.

అంతేకాదు నాకు నేను ఈ ప్రేమకు అర్హుడినేనా అంటూ ప్రశ్నించుకుంటున్నా..? నేను కేవలం ఐదుగురు సభ్యులున్న కుటుంబం నుంచి వచ్చినా.. దేవుడు నాకు ప్రపంచ వ్యాప్తంగా లక్షాలది సభ్యులున్న పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరంత నాకు కొండత అండగా నిలబడ్డారు. ఈ సందర్భంగా నాకు మీ పట్ల ఉన్న శాశ్వత ప్రేమ, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement