Message To Fans
-
ఆనంద్ మహీంద్రా సందేశం.. పనంతా నువ్వొక్కడివే చేయకు!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా వైరల్‌గా మారిన ఓ వీడియోను షేర్ చేశారు. అందులో కనిపించే దృశ్యం ద్వారా మీకు ఏం అర్థమైందంటూ ప్రశ్నించారు. మరుసటి రోజే తనకు ఏం స్ఫూరించిందో ట్విటర్ ద్వారా తెలిపారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఓ కోడిపుంజు గుక్క తిప్పుకోకుండా కూత పెడుతుంది. అలా శృతి మించి కూత పెడుతూ చివరకు కింద పడిపోతుంది. దీనికి తనదైన భాష్యం చెప్పారు ఆనంద్ మహీంద్రా... అందరి తరఫునా మనమే అన్ని పనులు చేయాలని అనుకోవడం దండగని దాని వల్ల మనమే ఖర్చయిపోతామంటూ నేటి యువతకు సందేశం ఇచ్చారు. My takeaway: If you try to make your voice drown out all other voices in the room, you’re going to run out of oxygen very quickly… https://t.co/1cNt4HWI9V — anand mahindra (@anandmahindra) June 8, 2022 చదవండి: తప్పు చేస్తే.. తప్పించుకోలేరు! సూపర్‌టెక్‌కి దెబ్బ మీద దెబ్బ -
నిరాశపరుస్తున్నందుకు మన్నించండి : హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్ : ప్రజలకు ఎప్పుడు చేరువలో ఉండే మాజీ మంత్రి హరీశ్‌రావు తన అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలను మన్నించాలని కోరారు. జూన్ 3వ తేదీన పుట్టిన రోజు జరుపుకోనున్న హరీశ్ ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. సోమవారం రోజున తాను సిద్ధిపేటలో కానీ, హైదరాబాద్‌లో కానీ ఉండటం లేదని తెలిపారు. తనను ఆశీర్వదించడానికి వస్తామనుకున్నవారిని నిరాశపరుస్తున్నందుకు మన్నించాల్సిందిగా ట్విటర్లో పేర్కొన్నారు. ‘మిత్రులకు, అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు. నా పుట్టిన రోజు (జూన్-3)న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి వస్తామంటూ ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు. మీ అందరిని నిరాశపరుస్తున్నందుకు మన్నించాలి. జూన్ 3న నేను హైదరాబాద్‌లో కానీ, సిద్ధిపేటలో కానీ ఉండడంలేదు. ముందే నిర్ణయించుకున్న వ్యక్తిగత కార్యక్రమాల్లో భాగంగా నేను దూరంగా ఉండవలసి వస్తోంది. నా పట్ల మీ ప్రేమను సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా చాటాలని కోరుకుంటున్నాను. మీ అభిమానానికి మరోసారి తలవొంచి నమస్కరిస్తున్నాన’ని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. pic.twitter.com/WGTF8EISun — Harish Rao Thanneeru (@trsharish) June 2, 2019 ఆదివారం తెలంగాణ అవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్ధిపేటలోని అమరవీరుల స్తూపం వద్ద హరీశ్‌రావు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనసభపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలు కూడా పాల్గొన్నారు. -
అభిమానులకు పవన్ సందేశం
ఈ రోజు (సెప్టెంబర్ 2) తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. 'నాపై ఇంతటి ప్రేమ, కరుణ చూపిస్తున్న అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ఈ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. నేను నా పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకోకపోయినా.. మీరంతా చేయటం ఆనందంగా ఉంది. అంతేకాదు నాకు నేను ఈ ప్రేమకు అర్హుడినేనా అంటూ ప్రశ్నించుకుంటున్నా..? నేను కేవలం ఐదుగురు సభ్యులున్న కుటుంబం నుంచి వచ్చినా.. దేవుడు నాకు ప్రపంచ వ్యాప్తంగా లక్షాలది సభ్యులున్న పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరంత నాకు కొండత అండగా నిలబడ్డారు. ఈ సందర్భంగా నాకు మీ పట్ల ఉన్న శాశ్వత ప్రేమ, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు. #1 I wholeheartedly thank you all for your love, support n kindness you keep showering on me. — Pawan Kalyan (@PawanKalyan) 1 September 2017 #2 Though, I don't celebrate my birthday but when I see you all celebrating it.. — Pawan Kalyan (@PawanKalyan) 1 September 2017 #3 ..and I feel all the more humbled ;look into my self and ask' Do I truly deserve this much of love?' — Pawan Kalyan (@PawanKalyan) 1 September 2017 #4Though, I come from a family of five but 'God' made me to embrace a much larger&huge family which is of millions spread across the Globe. — Pawan Kalyan (@PawanKalyan) 1 September 2017 #5 In my turbulent & testing times , you all.. truly stood by me..like the "Mighty Mount Everest". — Pawan Kalyan (@PawanKalyan) 1 September 2017 #6 My undying love& never ending gratitude for you all. - Pawan Kalyan — Pawan Kalyan (@PawanKalyan) 1 September 2017