రియల్ గబ్బర్.. పవన్ కల్యాణ్ తనయ | Pawan Kalyan's daughter Aadya riding horse | Sakshi
Sakshi News home page

రియల్ గబ్బర్.. పవన్ కల్యాణ్ తనయ

Published Mon, Jun 30 2014 5:17 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

రియల్ గబ్బర్.. పవన్ కల్యాణ్ తనయ - Sakshi

రియల్ గబ్బర్.. పవన్ కల్యాణ్ తనయ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో గుర్రంపై వచ్చి విలన్లను మట్టకరిపించే సన్నివేశాన్ని వీర లెవల్లో చూపించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి పవన్ క్రేజ్ను అమాంతం పెంచేసింది. అసలు విషయానికొస్తే పవన్ ముద్దుల కూతురు ఆద్య మూడేళ్ల వయసులోనే గుర్రంపై స్వారీ చేస్తూ ఔరా అనిపిస్తోంది.

ఆద్యకు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. మూడేళ్ల వయసు నుంచే నేర్చుకుంటోందట. ఈ విషయాలను ఆద్య తల్లి, పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ వెల్లడించింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రేణు.. ఆద్య గుర్రపు స్వారీ చేసే ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. పుణెలో నివాసం ఉంటున్న రేణు తన కొడుకు అకీరా పేరిట 'అకీరా పిల్మ్స్' బ్యానర్పై సినిమాలను నిర్మిస్తోంది. పవన్తో దూరంగా ఉన్నా ఆయన బంగారం అంటూ రేణు  ఫేస్బుక్లో ప్రశంసించింది. పవన్, రేణులకు అకీరా, ఆద్య సంతానం.

“Aadya doing one of her favorite activity...horse riding...she is doing it since she was 3yrs old,” Renu Desai tweeted

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement