
టాలీవుడ్‌లో ఈ ఏడాది పాయల్ రాజ్‌పుత్ ఒక సంచలనం. తెలుగులో నటించిన తొలి సినిమా ‘ఆర్‌ఎక్స్ 100’లోనే నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ చేయడమే కాకుండా ప్రేక్షకుల చేత భేష్ అనిపించుకున్నారీ పంజాబీ బ్యూటీ. అటు గ్లామర్ పరంగానూ కుర్రకారును ఆకట్టుకున్నారు. ఇప్పుడు రెండో సినిమాకి ఇంకా పెద్ద సవాల్‌ని స్వీకరించారు పాయల్. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి నిర్మాతగా ‘డిస్కో రాజా’(వర్కింగ్ టైటిల్) అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించనున్నారు. 1980 నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో హీరో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తారని సమాచారం.
అలాగే పాయల్ రాజ్‌పుత్ అంధురాలిగా, బధిర (మూగ, చెవిటి) యువతిగా నటించనున్నారు. అంటే.. ఈ సినిమాలో క్యారెక్టర్ పరంగా పాయల్‌కు వినిపించదు. కనిపించదన్నమాట. ఈ పాత్రలో పర్ఫెక్ట్‌గా ఒదిగిపోవడానికి బ్లైండ్ స్కూల్‌కి వెళ్లి అక్కడ ఉన్న స్టూడెంట్స్ హావభావాలను పరిశీలించాలని డిసైడ్ అయ్యారు పాయల్. అలాగే తమిళంలో ‘ఏంజిల్’ అనే చిత్రంలో ఒక కథానాయికగా నటిస్తున్నారామె. ఉదయనిథి స్టాలిన్ ఇందులో హీరో.
Comments
Please login to add a commentAdd a comment