
షార్ట్ ఫిలింస్‌తో ఆకట్టుకున్న దర్శకులు వెండితెర మీద కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే తరుణ్ భాస్కర్, శ్రీరామ్ ఆదిత్య, విరించి వర్మ, సుజిత్, కార్తీక్ ఘట్టమనేని లాంటి వారు లఘు చిత్ర నేపథ్యంతో వచ్చి మంచి విజయాలు సాధించారు అదే బాటలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు గురు ప్రసాద్. లఘు చిత్రాలతో ఆకట్టుకున్న గురుప్రసాద్, అంతా కొత్తవారితో ‘పెదవి దాటని మాటొకటుంది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఫ్యాంటసీ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ పాటలలోని పల్లవినే టైటిల్ గా తీసుకోవటంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.
కథ;
కథ విషయానికి వస్తే.. హీరో తరుణ్ (రావణ్ రెడ్డి) యావరేజ్ స్టూడెంట్. చిన్నతనం నుంచి తన బెస్ట్ ఫ్రెండ్స్ అభయ్ (మోయిన్) తప్ప ఎవరితో పెద్దగా కలవకుండా రూడ్‌గా బిహేవ్ చేస్తుంటాడు. అదే సమయంలో తన క్లాస్‌మేట్ అహాన(పాయల్ వాద్వా) ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తాడు. అలా కొన్నేళ్లు గడిచిపోతాయి. (సాక్షి రివ్యూస్) సింగర్ కావాలనుకున్న తరుణ్ కాలేజీ మధ్యలో వదిలేసి జానిటర్‌గా ఓ కంపెనీలో జాయిన్ అవుతాడు. ఆ కంపెనీ బాస్ స్కూల్ డేస్‌లో తరుణ్ ఏడిపించిన సాయిది కావటంతో అతను తరుణ్, అభయ్‌ల మీద రీవేంజ్ తీర్చేకునేందుకు వారిని ఇబ్బంది పెడుతుంటాడు. అంతేకాదు చిన్నతనంలో తను రిజెక్ట్ చేసిన అహానతో తరుణ్ ప్రేమలో పడతాడు. కానీ అహానా మాత్రం తరుణ్ మీద కోపం అతన్ని దూరం పెడుతుంది. ఓ రోజు ధైర్యం చేసి తన ప్రేమ విషయం చెప్పాలనుకున్నా చెప్పలేకపోతాడు. తరువాత అలా చెప్పలేకపోవటానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉందని తెలుస్తుంది. ఓ రోజు అనుకోని పరిస్థితుల్లో తరుణ్ ఓ వెబ్ సైట్‌లోకి లాగిన్ అవుతాడు. ఓ అతీంద్రియ శక్తుల కారణంగానే తరుణ్ ఆ వెబ్ సైట్‌లోకి లాగిన్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వటం వల్ల తరుణ్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది..? చివరకు అహానతరుణ్, ప్రేమను అంగీకరించిందా..?
నటీనటులు;
నటీనటుల విషయానికి వస్తే కేవలం సీనియర్ నరేష్ తప్ప మిగతా అంతా కొత్త వారే. హీరో తండ్రిగా నరేష్ తనకు అలవాటైన రోటీన్ పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నంలో చేశారు. హీరోగా రావణ్ రెడ్డి తొలి ప్రయత్నమే అయినా పరవాలేదనిపించాడు. హీరోయిన్ గా పాయల్ వాద్వాకు ఓకె అనిపించింది. ఇతర పాత్రల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు.లఘు చిత్ర నేపథ్యం నుంచి వచ్చిన దర్శకుడు గురుప్రసాద్ దర్శకుడిగా తన తొలి ప్రయత్నానికి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ను ఎంచుకున్నాడు. (సాక్షి రివ్యూస్) యూత్ ఫుల్ ప్రేమ కథకు ఫాంటసీ ఎలిమెంట్‌ను జోడించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే తను అనుకున్న కథను ఆసక్తికరంగా తెర మీద చూపించటంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. చాలా సన్నివేశాలు షార్ట్ ఫిలిం చూస్తున్న భావననే కలిగిస్తాయి. టెక్నికల్ అంశాలు కూడా సోసోగా ఉండటం నిరాశపరుస్తాయి. జెనిత్ రెడ్డి సంగీతమందించిన పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా లేవు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ కూడా నిరాశపరుస్తాయి. నిర్మాణ విలువలు పరవాలేదనిపిస్తాయి.