భద్రత మధ్యమీరా పెళ్లి!
భద్రత మధ్యమీరా పెళ్లి!
Published Wed, Feb 12 2014 11:11 PM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
మీరా జాస్మిన్ జీవితం ఓ కొత్త మలుపు తీసుకుంది. ఎన్నో తియ్యని కలలతో అనిల్ జాన్ టైటస్ చెయ్యి పట్టుకుని ఆ మలుపులోకి అడుగుపెట్టారు మీరా. దక్షిణాది భాషల్లో ఆమె పలు చిత్రాల్లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. సినిమా తారల మీద వచ్చే సహజమైన వదంతులే మీరా గురించి వచ్చాయి. వాటిలో మాండలిన్ రాజేష్‌ని ఆమె పెళ్లి చేసుకున్నారనే వార్త ఒకటి. అయితే, ఈ వార్తలో నిజం లేదని మీరా చెప్పినా, చాలామంది నమ్మలేదు. ఇప్పుడు నమ్మే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే, అనిల్ జాన్ టైటస్‌తో ఆమె వివాహం బుధవారం తిరువనంతపురంలోని పాలయం కోట్టయ్‌లో గల ఎల్‌ఎంఎస్ చర్చిలో జరిగింది.
ఈ ఇద్దరూ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. పోలీసుల భద్రత మధ్య ఈ పెళ్లి జరిగింది. కాగా, గతంలో అనిల్ ఓ యువతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. ప్రస్తుతం ఆ యువతి, ఆమె తండ్రి అనిల్-మీరాల పెళ్లి విషయంలో రచ్చ చేయడానికి ప్రయత్నించారట. మీరాని బెదిరించిందట కూడా. ఈ కారణంగా కోర్టు ద్వారా పోలీస్ ప్రొటెక్షన్ కోరారు అనిల్. ఆయన విన్నపాన్ని పరిశీలించిన మీద రక్షణ కల్పించింది. పెళ్లి తర్వాత కొన్ని మీరా రోజులు బ్రేక్ తీసుకున్నా సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలనుకోవడంలేదు.
Advertisement
Advertisement