
టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే. కెరీర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ లేకపోయినా ఈ భామ భారీ చిత్రాలతో సత్తా చాటుతున్నారు. ఇటీవల అరవింద సమేతతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తాజాగా మహర్షి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం రికార్డులు క్రియేట్ చేస్తోంది.
అయితే మహర్షి సెట్స్ మీద ఉండగానే మరిన్ని సినిమాలకు ఓకె చెప్పారు పూజ. త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా, ప్రభాస్ హీరోగా పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న జాన్ సినిమాలతో పాటు వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న వాల్మీకి సినిమాలోనూ నటించేందుకు ఓకే చెప్పారు. తాజా సమాచారం ప్రకారం వాల్మీకి నుంచి పూజా హెగ్డే తప్పుకున్నట్టుగా తెలుస్తోంది.
డేట్స్ అడ్జస్ట్ కానీ కారణంగానే పూజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా చెపుతున్నారు. తమిళ సూపర్ హిట్ జిగర్‌తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ నెగెటివ్ రోల్ లో కనిపించనున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంటలు నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment