
విజయ్ దేవరకొండ
కెరీర్ స్టార్ట్ చేసిన అతి తక్కువ సమయంలోనే పెద్ద విజయాలు, ఊహించని పాపులారిటీని సంపాదించారు విజయ్ దేవరకొండ. యూత్‌లో ఫాలోయింగ్, సొంత దుస్తుల సంస్థ, వంద కోట్ల క్లబ్ (‘గీత గోవిందం’ సినిమా)తో 2018ని సక్సెస్‌ఫుల్‌గా ముగించారు విజయ్ దేవరకొండ. తాజాగా ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో కూడా చోటు దక్కించుకున్నారు. భారతదేశ వ్యాప్తంగా 30 ఏళ్ల వయసులోపు వివిధ రంగాల్లో సూపర్ సక్సెస్‌ను, పాపులారిటీను ఎంజాయ్ చేస్తున్న వారి పేర్లను ఓ జాబితాగా ఫోర్బ్స్ మేగజీన్ విడుదల చేస్తుంది. తాజా ఎడిషన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీలో విజయ్ దేవరకొండ చోటు సంపాదించారు. ‘‘తెలుగు సినిమాల్లో రైజింగ్ స్టార్ విజయ్. తను చాలా సింపుల్‌గా, గ్రౌండెడ్‌గా ఉంటారు. ఎటు వెళ్లాలో తనకు క్లియర్‌గా తెలుసు’’ అంటూ ఆ మేగజీన్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment