ప్రేమను ద్వేషించే కుర్రాడి ప్రేమ కథ
ప్రేమను ద్వేషించే కుర్రాడి ప్రేమ కథ
Published Wed, Nov 20 2013 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM
ప్రపంచం మొత్తం ప్రేమ చుట్టూ తిరుగుతోంది. యువతరం అయితే.. ప్రేమ నామస్మరణతో తరించిపోతున్నారు. ఇలాంటి ఈ రోజుల్లో ఈ కుర్రాడు ‘ప్రేమా లేదు.. గీమా లేదు’ అంటూ ప్రేమను కూరలో కరేపాకులా తీసిపారేస్తున్నాడు. ఇంతకీ ఎవరీ అబ్బాయి? ప్రేమంటే ఇతగాడికి ఎందుకంత ద్వేషం? ప్రేమను ఇంతగా ద్వేషించే ఈ కుర్రాడి జీవితంతో ప్రేమ ఎలా ఆడుకుంది? ఆనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘ప్రేమగీమా జాన్‌తానయ్’.
‘ఇండియన్ ఐడిల్’ శ్రీరామచంద్ర, బార్బీ హండా జంటగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సుబ్బు ఆర్వీ దర్శకుడు. మద్దాల భాస్కర్ (భాను), దాడి బాలభాస్కర్ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘శ్రీరామచంద్ర హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో మహానటుడు ఎస్వీఆర్ మనవడు జూనియర్ ఎస్వీరంగారావు విలన్‌గా నటిస్తున్నారు. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఇందులో ఉండే ప్రేమ సన్నివేశాలు కొత్తగా ఉంటాయని దర్శకుడు చెప్పారు.
Advertisement
Advertisement