ఇన్‌స్టాగ్రామ్ ఫొటో
ఈ ఫొటోలోని చిన్నారిని గుర్తుపట్టారా? ఒకే ఒక్క వీడియో క్లిప్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారి సంచలనం సృష్టించిందీ తార. ఆమె ఎవరో ఈపాటికి మీరు కనిపెట్టేసి ఉంటారు. మీరు ఊహించినట్టుగా ఈ చిన్నారి మలయాళం భామ ప్రియా ప్రకాశ్ వారియర్.
ఆమె నటించిన మొదటి సినిమా ‘ఒరు అడార్ లవ్’ విడుదల కాకుండానే ఆమె స్టార్‌గా మారింది. ఒక్కరోజులో పాపులర్ అయిపోయింది. దీంతో ఆమెకు సంబంధించిన ప్రతి విషయం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ఆమెకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్‌ల సంఖ్య 35 లక్షలు దాటేసింది. అతి తక్కువ టైమ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ని రాబట్టుకుని సంచలనం సృష్టించింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటోలు ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసినవే.
కేరళ త్రిస్సూర్‌లోని ‘విమల కాలేజ్’లో బీకామ్ చదువుతున్న ప్రియ బహుముఖ ప్రతిభావంతురాలు. ఆమె నృత్యకారిణి కూడా. సంప్రదాయ మోహనిహట్టం నృత్యం నేర్చుకుంది. కాగా, ‘ఒరు అడార్ లవ్’ సినిమా లవ్ సీన్‌లో ప్రియ ‘కన్నుగీటే’ వీడియో ఇంటర్నెట్‌లో నిర్విరామంగా షేర్ అవుతూనే ఉంది. ఈ సినిమా వచ్చే నెలలో విడుదలకానుంది.
Comments
Please login to add a commentAdd a comment