
కథానాయికల వేలికి కొత్త ఉంగరం ఏదైనా కనిపించినా, మెడలో ఏదైనా గొలుసు కనిపించినా.. సీక్రెట్‌గా కల్యాణం కానిచ్చేసిందని చెప్పుకుంటారు. అది సహజం. అయితే విచిత్రంగా ప్రియాంకా చోప్రా చేతికున్న ఓ నల్లపూసల తాడుని చూసి, ‘చేతికి తాళిబొట్టులాంటిది ఉంది. ప్రియాంక ఎవరినో రహస్యంగా పెళ్లి చేసేసుకుంది’ అని కథలు అల్లడం మొదలుపెట్టారు.
ఈ కథలు ప్రియాంకా చోప్రా వరకూ వెళ్లాయి. సైలెంట్‌గా ఉంటే.. ‘మౌనం అర్ధాంగీకారం’ అని మరో కథ అల్లుతారని ఊహించారేమో.. ప్రియాంక క్లారిఫికేషన్ ఇచ్చేశారు. ‘‘నా చేతికున్నది తాళిబొట్టు కాదండి. దిష్టిపూసలండి బాబూ. పెళ్లి చేసుకుంటే మీ అందరికీ చెప్పే చేసుకుంటా. కచ్చితంగా సీక్రెట్ మ్యారేజ్ చేసుకోను’’ అని పేర్కొన్నారామె.
Comments
Please login to add a commentAdd a comment