
ప్రియాంకా చోప్రా
హాలీవుడ్ వెళ్లిపోయినా హిందీ సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నారు ప్రియాంకా చోప్రా. ‘ది స్కై ఈజ్ పింక్’ అనే సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేశారామె. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకటి కాదు.. ఏకంగా రెండు నెట్‌ఫ్లిక్స్ చిత్రాలను అంగీకరించారు. ఒకటేమో ‘వియ్ కెన్ బీ హీరోస్’. ఈ సినిమాను ఇటీవలే ప్రకటించారు. తాజాగా మరో నెట్‌ఫ్లిక్స్ చిత్రాన్ని బుధవారం అనౌన్స్ చేశారు. అరవింద్ అడిగా రచించిన ‘ద వైట్ టైగర్’ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రియాంకా చోప్రా, రాజ్‌కుమార్ రావ్, ఆదర్ష్ గౌరవ్ ముఖ్య పాత్రల్లో నటిస్తారు. ఇరానీ–అమెరికన్ దర్శకుడు రామిన్ బహ్రానీ ఈ సినిమాకు దర్శకుడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ప్రియాంక చోప్రా వ్యవహరించనున్నారు. కథ ఆమెకు అంతగా నచ్చిందట.
Comments
Please login to add a commentAdd a comment