ఆ పోరాటం నా మనసును కదిలించింది | Priyanka Chopra Turns Executive Producer For Oscar Nominated To Kill A Tiger As Netflix Prepares To Launch Film Globally - Sakshi
Sakshi News home page

ఆ పోరాటం నా మనసును కదిలించింది

Published Mon, Feb 26 2024 2:23 AM | Last Updated on Mon, Feb 26 2024 9:50 AM

Priyanka Chopra turns executive producer for Oscar nominated To Kill a Tiger as Netflix prepares to launch film globally - Sakshi

ఆస్కార్‌ నామినేటెడ్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ ‘టు కిల్‌ ఏ టైగర్‌’కు ఓ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందంటున్నారు బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా. భారతదేశంలో జన్మించి కెనడాలో పెరిగిన నిషా పహుజా ‘టు కిల్‌ ఏ టైగర్‌’ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు. జార్ఖండ్‌లో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ‘టు కిల్‌ ఏ టైగర్‌’ తీశారు నిషా. కుమార్తెకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలంటూ ఓ తండ్రి చేసే పోరాటం నేపథ్యంలో  కథాంశం ఉంటుంది. తాజాగా ‘టు కిల్‌ ఏ టైగర్‌’ డిస్ట్రిబ్యూషన్   రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది.

అలాగే ‘టు కిల్‌ ఏ టైగర్‌’కు ప్రియాంకా చోప్రా, దేవ్‌ పటేల్‌తో పాటు మరికొంతమంది ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై ప్రియాంకా చోప్రా స్పందించారు. ‘‘టు కిల్‌ ఏ టైగర్‌’ను తొలిసారిగా నేను 2012లో చూశాను. తన కూతురికి న్యాయం జరగడం కోసం ఓ తండ్రి చేసే పోరాటం నా మనసును కదిలించింది. నేనూ జార్ఖండ్‌లోనే జన్మించాను. ఓ తండ్రికి కూతుర్ని కూడా. ఈ ప్రాజెక్ట్‌తో అసోసియేషన్  అవుతున్నందుకు చాలా గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు. మార్చి 10న లాస్‌ ఏంజెల్స్‌లో జరిగే 96వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో  ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ ‘టు కిల్‌ ఏ టైగర్‌’ అవార్డు గెలుస్తుందా? వేచి చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement