న్యూయార్క్లో సన్నీ, ప్రియాంక.. | Priyanka Chopra's day out with Sunny Leone in NY | Sakshi
Sakshi News home page

న్యూయార్క్లో సన్నీ, ప్రియాంక..

Published Sun, Sep 11 2016 6:45 PM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

న్యూయార్క్లో సన్నీ, ప్రియాంక.. - Sakshi

న్యూయార్క్లో సన్నీ, ప్రియాంక..

న్యూయార్క్: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, ఇండో-కెనడియన్ నటి సన్నీ లియోన్లు న్యూయార్క్లో సరదాగా గడిపారు. అమెరికన్ టీవీ సిరీస్ 'క్వాంటికో' రెండో సీజన్లో నటిస్తున్న ప్రియాంక షూటింగ్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లింది. ఇక న్యూయార్క్ ఫ్యాషన్ వీక్లో పాల్గొనేందుకు సన్నీ కూడా అక్కడకు వెళ్లింది. ఇద్దరూ న్యూయార్క్లో బసచేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక, సన్నీ ఇద్దరూ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఓ రోజు మధ్యాహ్నం ఇద్దరూ కలుసుకుని సరదాగా గడిపారు. ఈ విషయాన్ని సన్నీ, ప్రియాంక ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. న్యూయార్క్ ఫ్యాషన్ షోలో యాసిడ్ బాధితురాలు రేష్మా ఖురేషీతో కలసి సన్నీ పాల్గొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement