
కలల చిత్రం ఆగిందా..?
ప్రియాంకా చోప్రా కథానాయికగా మాధుర్ బండార్కర్ ‘మేడమ్‌జీ’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాలనుకున్నారు. ఈ చిత్ర కథ బాగా నచ్చడంతో ప్రియాంక నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించాలనుకున్నారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా ప్రియాంక పేర్కొన్నారు. అయితే ఇప్పుడా కలల చిత్రం ఆగిందనే వార్త వినిపిస్తోంది. హిందీ చిత్రాలు, అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’తో బిజీగా ఉన్నందున ఇప్పుడప్పుడే ‘మేడమ్‌జీ’కి తేదీలు కేటాయించలేని పరిస్థితిలో ప్రియాంక ఉన్నారట. దాంతో ఈ చిత్రం ప్రస్తుతం పట్టాలెక్కే అవకాశం లేదని సమాచారం.