భారీ బడ్జెట్తో పైసా వసూల్ | Puri Risking With High Budget Movie Paisa Vasool | Sakshi
Sakshi News home page

భారీ బడ్జెట్తో పైసా వసూల్

Published Tue, Jul 25 2017 10:57 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 PM

భారీ బడ్జెట్తో పైసా వసూల్

భారీ బడ్జెట్తో పైసా వసూల్

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ పైసా వసూల్. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు  జరుపుకుంటోంది. బాలకృష్ణకు జోడిగా సీనియర్ హీరోయిన్ శ్రియ నటిస్తుండగా, ముస్కాన్ సేతి, కైరా దత్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను బాలకృష్ణ మార్కెట్ రేంజ్ను మించి భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఎక్కువ భాగం ఫారిన్ లోకేషన్స్లో షూట్ చేయటంతో పాటు కాస్టింగ్ కూడా భారీగా ఉండటంతో బడ్జెట్ 47 కోట్లకు చేరిందన్న ప్రచారం జరుగుతుంది. అయితే బాహుబలి తరువాత తెలుగు సినిమాలకు ఇతర రాష్ట్రాల్లో కూడా మంచిమార్కెట్ ఏర్పడటంతో ఈ బడ్జెట్ పెద్ద రిస్క్ కాదని భావిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈసినిమాను సెప్టెంబర్ 29న రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement