నాతో వస్తే నేనూ రెడీ! | Raai Laxmi In Big Boss Reality Show ? | Sakshi
Sakshi News home page

నాతో వస్తే నేనూ రెడీ!

Published Wed, May 16 2018 8:39 AM | Last Updated on Thu, Jul 18 2019 1:41 PM

Raai Laxmi In Big Boss Reality Show ? - Sakshi

తమిళసినిమా: మీరు పాల్గొంటే నేనూ రెడీ అంటోంది నటి రాయ్‌లక్ష్మి. ఇంతకీ దేని గురించి ఈ అమ్మడు చెప్పేది అనేగా మీ ఆసక్తి. అవును నటి రాయ్‌లక్ష్మి గురించిన టాపిక్‌ అంటేనే ఆసక్తే. కోలీవుడ్‌లో పలు చిత్రాలు, టాలీవుడ్‌లో చాలా తక్కువ చిత్రాలు, హిందీలో ఒక చిత్రంలోనూ కథానాయకిగా నటించిన రాయ్‌లక్ష్మి ఈ మధ్య చిరంజీవితో ఐటమ్‌ సాంగ్‌లో నటించి అందాలారబోసింది. అంత కంటే మరింత సెక్సీగా హిందీ చిత్రం జూలీలో నటించింది. అయినా పెద్దగా మార్కెట్‌ను పెంచుకోలేకపోయింది. అయితే చాలా కాలం తరువాత కోలీవుడ్‌లో యార్, నీయా–2 చిత్రాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంది. ఈ అమ్మడి గురించి హల్‌చల్‌ చేస్తున్న పలు వదంతుల్లో బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలో పాల్గొనబోతోందన్నది ఒకటి.

కమలహాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్‌ గేమ్‌ షో విశేష ఆదరణను పొందిన విషయం తెలిసిందే. దీంతో బిగ్‌బాస్‌ సీజన్‌–2కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సీజన్‌–2కు కమలహాసన్‌నే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. జూన్‌ 17 నుంచి ఈ గేమ్‌షో మొదలవుతుందని నిర్వాహకులు వెల్లడించారు. అంతే కాదు ఈ గేమ్‌ షోలో పాల్గొనే వారిలో కొందరు పేర్ల గురించి ప్రచారం జరుగుతోంది. అందులో నటి రాయ్‌లక్ష్మి పేరు చోటుచేసుకోవడం విశేషం. దీని గురించి స్పందించిన రాయ్‌లక్ష్మి ఎందుకు గేమ్‌ షో ప్రారంభం అవుతున్న ప్రతిసారి తను పేరును ప్రస్తవిస్తుంటారు అని కొంచెం సీరియస్‌గానే అంది. మీడియాలో కొందరికి తన గురించి వదంతులు ప్రచారం చేయడమే ఒకపనిగా మారిందని తన ట్విట్టర్‌లో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

రాయ్‌లక్ష్మి ట్వీట్‌కు స్పందించిన బాలీవుడ్‌ నటి బిపాసాబసు భర్త కరణ్‌ వి.కురువర్‌ తాము మిమ్మల్ని బిగ్‌బాస్‌–2లో చూడాలని కోరుకుంటున్నాం అని పేర్కొన్నారు. ఆయనకు బదులిచ్చిన రాయ్‌లక్ష్మి మీరు నాతో కూడా వస్తే తాను బిగ్‌బాస్‌–2 గేమ్‌షోలో పాల్గొనడానికి రెడీ అని అంది. అదే విధంగా మరో అభిమాని తానూ మిమ్మల్ని ఆ గేమ్‌షోలో చూడాలనుకుంటున్నాను అని అనగా తాను బిగ్‌బాస్‌–2లో పాల్గొంటే నిప్పురాజుకుంటుందని రాయ్‌లక్ష్మి పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement