
రాధికా శరత్‌కుమార్
‘నకరాల్ పడితే తోల్ తీస్తా’ అని వీర మాస్ లెవల్లో రౌడీలకు వార్నింగ్ ఇస్తున్నారు నటి రాధికా శరత్‌కుమార్. ఆమె పోలీసాఫీసర్ పాత్ర చేయడం లేదు. వార్నింగ్ ఇస్తుంది డాన్ పాత్రలో. శరణ్ దర్శకత్వంలో అరవ్, కావ్వథాపర్, రాధికా శరత్‌కుమార్ ముఖ్య పాత్రలుగా ‘మార్కెట్ రాజా ఎంబీబీఎస్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అరవ్ లోకల్ డాన్ అండ్ రైల్వే కండక్టర్ పాత్రలో నటిస్తున్నారు. రాధిక డాన్‌గా నటిస్తున్నారు. ‘‘అరవ్ తల్లిగా రాధిక డాన్ పాత్రలో కనిపిస్తారు. ఆమె యాక్టింగ్‌లో ఎం.ఆర్. రాధ (రాధిక తండ్రి, ప్రముఖ తమిళ నటుడు) బాడీ లాంగ్వేజ్‌ను ఆడియన్స్ చూస్తారు. వాయిస్ మాడ్యులేషన్ కూడా అలానే ఉంటుంది’’ అని దర్శకుడు అన్నారు. ఈ సినిమా చిత్రీకరణ 80 శాతం పూర్తయింది. నెక్ట్స్ షెడ్యూల్‌ను చెన్నైలో ప్లాన్ చేశారు. సిమ్మన్ కె. కింగ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment