
ఇటీవలె తమిళనాడులో గజ తుపాను సృష్టించిన బీభత్సం గురించి తెలిసిందే. దీని ధాటికి ఎంతో మంది వీదిన పడ్డారు. ఎంతో ఆస్తి నష్టంతో పాటు.. ప్రాణనష్టమూ సంభవించింది. అయితే వీరిని ఆదుకోవడానికి తమిళ సినీ ప్రముఖులు ఎంతో మంది ముందుకువచ్చారు.
గజ తుపాను ధాటికి ఓ వృద్దురాలి ఇళ్లు కూలిపోయింది.అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. రాఘవ లారెన్స్ కంటపడింది. తుపాను బాధితులకు అండగా.. ఓ యాభై మందికి ఇళ్లు నిర్మించి ఇస్తానని ప్రకటించారు. అందులో భాగంగా మొదటి ఇళ్లును ఆ వృద్దురాలికే కట్టిస్తానని మాటిచ్చారట. ఇంకా ఎవరైనా ఆపదలో ఉంటే.. తనకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
— Raghava Lawrence (@offl_Lawrence) November 25, 2018
Comments
Please login to add a commentAdd a comment