బాహుబలికి సవాల్‌గా 2.0 | rajamouli Baahubali 2 vs shankar Robot 2.0 | Sakshi
Sakshi News home page

బాహుబలికి సవాల్‌గా 2.0

Published Mon, Jun 5 2017 10:49 AM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM

బాహుబలికి సవాల్‌గా 2.0

బాహుబలికి సవాల్‌గా 2.0

బాహుబలి–2 చిత్రం ఇండియన్‌ సినిమాలోనే ఒక సంచలనం. ప్రపంచ సినిమాను తనవైపు చూసేలా చేసిన బ్రహ్మండ చిత్రం బాహుబలి–2. వసూళ్ల పరంగా భారతీయ సినిమా రికార్డులను బద్దలుకొట్టిన చిత్రం ఇది. హిందీ చిత్రం దంగల్‌ కలెక్షన్ల పరంగా బాహుబలి–2కు దీటుగా నిలిచేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ రెండు చిత్రాలు దర్శకుడు శంకర్‌కు పెద్ద పరీక్షనే పెడుతున్నాయని చెప్పాలి.

తాజాగా శంకర్‌.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా, బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ ప్రతినాయకుడిగా, ఇంగ్లీష్‌ బ్యూటీ ఎమీజాక్సన్‌ కథానాయకిగా తెరకెక్కిస్తున్న చిత్రం 2.0. ప్రస్తుతం బాహుబలి–2, దంగల్‌ చిత్రాల రికార్డులను బ్రేక్‌ చేయడమే శంకర్‌ ముందున్న లక్ష్యంగా మారింది. దీంతో 2.0 చిత్ర యూనిట్‌పై బాధ్యతలు రెట్టింపయ్యాయి. కారణాలేమయినా 2.0 చిత్ర నిర్మాణ వ్యయం, చిత్రీకరణ రోజులు పెరుగుతున్నాయని చెప్పక తప్పదు. ఇప్పటికే విడుదల తేదీని రెండుసార్లు వాయిదా వేసుకున్న చిత్ర వర్గాలు, సాంకేతికత పరంగా ప్రత్యేక దృష్టి పెట్టారని సమాచారం. హాలీవుడ్‌ సాంకేతిక వర్గాన్ని రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది.

ఎట్టకేలకు 2.0 చిత్రాన్ని జనవరిలో భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఇందులో విశేషాలేమిటంటే ప్రపంచ వ్యాప్తంగా  15భాషల్లో, 7వేల థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయని తెలిసింది. ఇదే నిజమైతే ఇప్పటి వరకూ 2.0 చిత్రం సాధించే తొలి రికార్డ్‌ అవుతుంది. ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర శాటిలైట్‌ హక్కులే రూ.110 కోట్లకు అమ్ముడు పోవడం మరో రికార్డు. మొత్తం మీద బాహుబలి చిత్రానికి 2.0 సవాల్‌ విసురుతుందా? వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement