robot 2.0
-
సిద్దిపేటలో ‘రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్’
భోజనం చేయడానికి హోటల్‌కు వెళ్తే ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత మామూలుగా అయితే మనుషులు (వెయిటర్లు) ఆహారాన్ని తీసుకొచ్చి కస్టమర్లకు వడ్డిస్తారు. కానీ ఇక్కడ రోబోలే స్వాగతం పలుకుతాయి. మనతో మాట్లాడి ఫుడ్ ఆర్డర్ తీసుకుంటాయి. ఆర్డర్ చేశాకా ఆ ఫుడ్‌ను ప్లేట్లో రోబోలే పట్టుకొస్తాయి. ఇది ఎక్కడో కాదు సిద్దిపేట పట్టణం కరీంనగర్ రోడ్డులో ఇటీవలె ప్రారంభమైన ‘రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్’. ఈ హోటల్ యజమాని తీసుకొచి్చన వినూత్న ఆలోచనకు భోజన ప్రియులు ఆకర్షితులవుతున్నారు. సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్లో రెండు రోబోలను హైదరాబాద్ నుంచి రూ. 6 లక్షలకు కొనుగోలు చేసి తీసుకొచ్చారు. ఈ రోబోలు చార్జింగ్ బ్యాటరీల సాయంతో పని చేస్తాయి. భోజనం చేయడానికి హోటల్‌కు వెళ్లగానే ముందుగా రోబోలు కస్టమర్లు కూర్చున్న టేబుల్ వద్దకు వెళ్లి ‘నమస్కారం సార్, మేడమ్.. రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్‌కు స్వాగతం. నా పేరు మైత్రీ ఫుడ్ ఆర్డర్ చేయండి సార్ అని పలుకుతుంది. మనకు నచి్చన భోజనం ఆర్డర్ చేసిన తర్వాత మరో రోబో ఆర్డర్ చేసిన భోజనం ఫ్లేట్లో కస్టమర్ కూర్చున్న టేబుల్ వద్దకు తీసుకొస్తుంది. వేడి వేడి ఆహారాన్ని తీసుకొచ్చాను.. ధన్యవాదాలు సార్ అని చెబుతుంది. ఆడుకోవడానికి గేమ్స్ జోన్.. ఇలా వినూత్న పద్ధతిలో భోజనం వడ్డిస్తూ కస్టమర్లను, భోజన ప్రియులను ఆకర్షిస్తుంది ఈ రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్. ఇప్పటికే సిద్దిపేటలో ట్రైన్ రెస్టారెంట్‌ను నిర్వాహకులు నడుపుతున్నారు. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా, కస్టమర్లను ఆకర్షించే విధంగా వినూత్న పద్ధతిలో రోబోలను ఏర్పాటు చేసి వాటి సాయంతో భోజనాన్ని సరఫరా చేస్తూ హోటల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ రోబో ఫ్యామిలీ రెస్టారెంట్లో చిన్న పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా గేమ్స్ జోన్, రాత్రి సమయంలో ప్రత్యేక లైటింగ్, హోం థియేటర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. వీకెండ్లో తాకిడి ఎక్కువ.. ఈ రెస్టారెంట్లో ఇతర హోటల్లో ఉన్న రేట్ల మాదిరిగానే సాధారణ చార్జీలు ఉంటాయని హోటల్ నిర్వాహకులు తెలిపారు. 20 రోజుల క్రితం ఓపెన్ చేసిన హోటల్‌కు కస్టమర్లు చిన్న పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా వస్తున్నారని, వీకెండ్లో కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. హోటల్లో అన్ని రకాల చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్ బిర్యానీలు, ఇతర భోజనాలు, వెజ్, నాన్‌వెజ్ అందుబాటులో ఉన్నాయి. ఇందులోని రోబోలతో ఫొటోలు దిగడానికి, ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి కస్టమర్లు హోటల్‌కు క్యూ కడుతున్నారు. పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు సిద్దిపేటలో రోబో ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెన్ చేశారని తెలిసి కుటుంబంతో కలిసి భోజనం చేయడానికి వచ్చాం. ఫుడ్ ఆర్డర్ చేస్తే రోబోలు భోజనం తీసుకురావడం, అవి మాట్లాడడం డిఫరెంట్‌గా ఉంది. పిల్లలు రోబోలతో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపు తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడి రావడం సంతోషంగా ఉంది. – మేఘన, గృహిణి, సిద్దిపేట వినూత్న ఆలోచనతో.. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా హోటల్లో రోబోలను ఏర్పా టు చేశాం. వాటితో భోజనం సప్లయ్ చేయిస్తున్నాం. రూ.6 లక్షల విలువ గల రెండు రోబోలను పెట్టి వాటి సాయంతో కస్టమర్లకు వేడి వేడి ఆహారాన్ని అందిస్తున్నాం. చార్జింగ్ బ్యాటరీల సాయంతో రోబోలు పని చేస్తాయి. హోటల్లో పనిచేసే వారు వీటిని ఆపరేట్ చేస్తారు. – సతీష్ రెస్టారెంట్ నిర్వాహకులు -
రిలీజ్‌కు ముందే 200 కోట్ల భారీ బిజినెస్!
బాహుబలి సినిమా బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలుకొట్టిన నేపథ్యంలో ఇప్పుడు అదేస్థాయిలో అంచనాలతో మరో దక్షిణాది సినిమా రాబోతున్నది. అదే దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రోబో-2. రజనీకాంత్, అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా 2018కి బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలునుందని భావిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా హిందీ థియేటర్ ప్రదర్శన హక్కులు ఏకంగా రూ. 80 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ‘2.0 హిందీ ప్రదర్శన హక్కుల కోసం రూ. 100 కోట్లు ఇవ్వాల్సిందిగా నిర్మాతలు కోరారు. అయితే అంత మొత్తం చెల్లించడానికి హిందీ డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడానికి వెనుకాడరు. అంత భారీ మొత్తం చెల్లించడం రిస్కీతో కూడుకున్న పని, కొంత తగ్గించాలని వారు కోరారు. దీంతో అనేక మంతనాల అనంతరం రూ. 80 కోట్లకు హిందీ హక్కులను కొనేందుకు డిస్టిబ్యూటర్లు ముందుకొచ్చారు. రజనీకాంత్ ఛరిష్మా, అక్షయ్‌కుమార్ ఆలిండియా పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని ఇంత మొత్తాన్ని ఇవ్వడానికి డిస్ట్రిబ్యూటర్లు ముందుకొచ్చారు’ అని డీఎన్ఏ పత్రిక ఓ కథనంలో తెలిపింది. రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా భావిస్తున్నారు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం జీ నెట్వర్క్ ఏకంగా రూ. 110 కోట్లు చెల్లించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డిజిటల్ రైట్స్ కోసం అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌తో చిత్ర నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. మొత్తానికి విడుదలకు ముందే ఈ చిత్రం దాదాపు రూ. 200 కోట్ల వ్యాపారం చేసిందని, మున్ముందు మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశముందని అంటున్నారు. -
బాహుబలికి సవాల్‌గా 2.0
బాహుబలి–2 చిత్రం ఇండియన్ సినిమాలోనే ఒక సంచలనం. ప్రపంచ సినిమాను తనవైపు చూసేలా చేసిన బ్రహ్మండ చిత్రం బాహుబలి–2. వసూళ్ల పరంగా భారతీయ సినిమా రికార్డులను బద్దలుకొట్టిన చిత్రం ఇది. హిందీ చిత్రం దంగల్ కలెక్షన్ల పరంగా బాహుబలి–2కు దీటుగా నిలిచేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ రెండు చిత్రాలు దర్శకుడు శంకర్‌కు పెద్ద పరీక్షనే పెడుతున్నాయని చెప్పాలి. తాజాగా శంకర్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడిగా, ఇంగ్లీష్ బ్యూటీ ఎమీజాక్సన్ కథానాయకిగా తెరకెక్కిస్తున్న చిత్రం 2.0. ప్రస్తుతం బాహుబలి–2, దంగల్ చిత్రాల రికార్డులను బ్రేక్ చేయడమే శంకర్ ముందున్న లక్ష్యంగా మారింది. దీంతో 2.0 చిత్ర యూనిట్‌పై బాధ్యతలు రెట్టింపయ్యాయి. కారణాలేమయినా 2.0 చిత్ర నిర్మాణ వ్యయం, చిత్రీకరణ రోజులు పెరుగుతున్నాయని చెప్పక తప్పదు. ఇప్పటికే విడుదల తేదీని రెండుసార్లు వాయిదా వేసుకున్న చిత్ర వర్గాలు, సాంకేతికత పరంగా ప్రత్యేక దృష్టి పెట్టారని సమాచారం. హాలీవుడ్ సాంకేతిక వర్గాన్ని రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. ఎట్టకేలకు 2.0 చిత్రాన్ని జనవరిలో భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఇందులో విశేషాలేమిటంటే ప్రపంచ వ్యాప్తంగా 15భాషల్లో, 7వేల థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయని తెలిసింది. ఇదే నిజమైతే ఇప్పటి వరకూ 2.0 చిత్రం సాధించే తొలి రికార్డ్ అవుతుంది. ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర శాటిలైట్ హక్కులే రూ.110 కోట్లకు అమ్ముడు పోవడం మరో రికార్డు. మొత్తం మీద బాహుబలి చిత్రానికి 2.0 సవాల్ విసురుతుందా? వేచి చూడాల్సిందే. -
'రోబో 2' ఫొటో లీక్..!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ప్రఖ్యాత దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం '2.0'. తమ కాంబినేషన్ లో వచ్చిన 'రోబో' సినిమాకు సీక్వెల్ గా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతోంది. ఇక్కడి జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. పోరాట దృశ్యాలు చిత్రీకరించారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ సినిమాలో సైంటిస్ట్ పాత్రలో విలన్ గా నటిస్తున్నాడు. అక్కీ పాత్రకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది. అతడికి కాకి గెటప్ వేశారు. బ్లాక్ కలర్ డ్రెస్, పెద్ద కనుబొమలు, వెరైటీ కనుగడ్లు, వైట్ హెయిర్ తో చూడగానే భయం కలిగించేలా అక్షయ్ కుమార్ గెటప్ ఉంది. ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఈ ఫొటో ప్రచురించింది. పడక్బందీగా షూటింగ్ సాగిస్తుండడంతో ఈ సినిమాకు సంబంధించిన సంగతులు బయటకు రావడం లేదు. షూటింగ్ స్పాట్ కు సెల్ ఫోన్లు కూడా అనుమతించడం లేదు. 'రోబో 2.0'కు డబుల్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రఫర్ నిరవ్ షా కెమెరామెన్ గా పనిచేస్తున్నాడు.