'రోబో 2' ఫొటో లీక్..! | Akshay Kumar's look in Rajinikanth-starrer 2.0. has been out | Sakshi
Sakshi News home page

'రోబో 2' ఫొటో లీక్..!

Published Wed, Mar 23 2016 9:46 AM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

'రోబో 2' ఫొటో లీక్..!

'రోబో 2' ఫొటో లీక్..!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ప్రఖ్యాత దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం '2.0'. తమ కాంబినేషన్ లో వచ్చిన 'రోబో' సినిమాకు సీక్వెల్ గా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దేశ రాజధాని ఢిల్లీలో  జరుగుతోంది. ఇక్కడి జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. పోరాట దృశ్యాలు చిత్రీకరించారు.

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ సినిమాలో సైంటిస్ట్ పాత్రలో విలన్ గా నటిస్తున్నాడు. అక్కీ పాత్రకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది. అతడికి కాకి గెటప్ వేశారు. బ్లాక్ కలర్ డ్రెస్, పెద్ద కనుబొమలు, వెరైటీ కనుగడ్లు, వైట్ హెయిర్ తో చూడగానే భయం కలిగించేలా అక్షయ్ కుమార్ గెటప్ ఉంది. ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఈ ఫొటో ప్రచురించింది.

పడక్బందీగా షూటింగ్ సాగిస్తుండడంతో ఈ సినిమాకు సంబంధించిన సంగతులు బయటకు రావడం లేదు. షూటింగ్ స్పాట్ కు సెల్ ఫోన్లు కూడా అనుమతించడం లేదు. 'రోబో 2.0'కు డబుల్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రఫర్ నిరవ్ షా కెమెరామెన్ గా పనిచేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement